ఈ కన్ఫ్యూజన్ ఏంటి నాని ?

థియేటర్లు తెరుచుకున్నాయి. రెండు వారాలు గడిచాయి. తిమ్మరుసు ఏమో కానీ అసలు ఏ ఇమేజ్ లేని కిరణ్ అబ్బవరం నటించిన ఎస్ఆర్ కళ్యాణ మండపానికి మొదటి మూడు రోజులు వచ్చిన వసూళ్లు చూసి డిస్ట్రిబ్యూటర్లు షాక్ తిన్నారు. జనం హాళ్లకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారనే క్లారిటీ వచ్చింది. కట్ చేస్తే ఇంకో నాలుగు రోజుల్లో పాగల్ తో మొదలుపెట్టి మెల్లగా పెద్ద సినిమాలు రంగంలోకి దిగబోతున్నాయి. కానీ న్యాచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీశ్ మాత్రం ఓటిటినా థియేటరా అనే విషయం ఎటూ తేల్చకుండా ఇంకా నాన్చుడు మంత్రాన్ని పఠిస్తోంది. కొద్దిరోజుల క్రితం ఓటిటి లాక్డ్ అనే టాక్ చాలా బలంగా వినిపించింది.

తాజాగా జరుగుతున్న ప్రచారం మేరకు టక్ జగదీష్ ని ఈ నెల 27న థియేటర్లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు డిసైడ్ అయినట్టు చెబుతున్నారు. చాలా తక్కువ గ్యాప్ తో తర్వాత ప్రైమ్ లో వస్తుందట. ఇందులో నిజమెంతో కానీ మొత్తానికి ఇలా అటుఇటు ఊగిసలాడటం మాత్రం ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో రీతూ వర్మ హీరోయిన్. తమన్ సంగీతం సమకూర్చారు. ఫ్యామిలీ ఆడియన్స్ లో దీని మీద మంచి బజ్ ఉంది. సో థియేటర్లలో వదిలితే కలెక్షన్లు బాగా వస్తాయనే అభిప్రాయంలో డిస్ట్రిబ్యూటర్లు ఉన్నట్టుగా కనిపిస్తోంది

కానీ ఇప్పటికిప్పుడు దీన్ని నిర్ధారణగా చెప్పలేం. ఎందుకంటే పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఇక్కడో విషయం మర్చిపోకూడదు. ఎస్ఆర్ కళ్యాణ మండపాన్ని స్ఫూర్తిగా తీసుకున్నా దాని జోరు మూడు రోజులే బలంగా కనిపించింది. తర్వాత నెమ్మదించింది. చిన్న సినిమా కాబట్టి బిజినెస్ కు తగ్గట్టే బ్రేక్ ఈవెన్ ఈజీగా అయ్యింది. కానీ టక్ జగదీష్ అలా కాదు. ఓటిటి డీల్ వదులుకున్నంత లాభం రావాలంటే కనీసం 30 కోట్ల షేర్ రావాలి. అంటే 50 కోట్ల దాకా గ్రాస్ ఉండాలి. ప్రాక్టికల్ గా ఇది ఈజీ కాదు. మరి టక్ జగదీష్ ఓటిటినా థియేటరా అనేది తేల్చి చెప్పేస్తే బెటర్. ఓ పనైపోతుంది

Also Read : టీవీ సినిమాల్లో ఠాగూర్ సింగ్ ముద్ర

Show comments