‘మా’ కాష్టం ఎప్పటికి చల్లారుతుందో

నిన్న మధ్యాహ్నం మీడియాలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో రాజీనామా చేసినవాళ్లు ఆత్మ(ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్)పేరుతో వేరు కుంపటి పెడతారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ అలాంటిదేమి జరగలేదు. నిప్పు లేనిదే పొగరాదు తరహాలో ఏదో ఒక రూపంలో లీక్ బయటికి వచ్చింది కాబట్టే అంత ధీమాగా న్యూస్ ఛానల్స్ దాన్ని ప్రసారం చేశాయి. అయితే ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారని, తొందరపడి ప్రకటిస్తే ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎక్కడికో దారి తీస్తాయనే ఉద్దేశంతో ఆగిపోయినట్టు ఇన్ సైడ్ టాక్. ముందు మంచు విష్ణు, మోహన్ బాబు, నరేష్ లు ఈ రాజీనామాల పట్ల ఎలా రియాక్ట్ అవుతారో చూసి అప్పుడు మళ్ళీ స్పందించే అవకాశం ఉంది.

సోషల్ మీడియాలోనూ దీని మీద విస్తృతంగా చర్చ జరుగుతోంది. బెనర్జీని మోహన్ బాబు తీవ్ర స్థాయిలో దూషించడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఆయన బయటికి వచ్చి క్లారిటీ ఇస్తే కానీ నిజంగా తప్పు జరిగిందా లేదా అనేది బయటికి రాదు. తనీష్, బెనర్జీ, ఉత్తేజ్, ప్రభాకర్ ఇలా అందరూ కలెక్షన్ కింగ్ ప్రవర్తన గురించే ఎక్కువ చెప్పారు కాబట్టి విష్ణు ఎలా డిఫెండ్ చేసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. లోపల జరిగిన వ్యవహారం తాలూకు వీడియో ఫుటేజీలు ఏమైనా ఉంటే వాటిని బయటపెట్టడం ఒక మార్గం. లేదూ అంటే సహేతుకమైన లాజిక్స్ తో ఆ రోజు ఏం జరిగిందనేది మోహన్ బాబు వివరించాలి.

పైకి కనిపించినా కనిపించకపోయినా ఇప్పుడిది మెగా వర్సెస్ మంచు ఇష్యూ గా మారిపోయిందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గెలిచిన వాళ్ళు తమ పదవులు వద్దనుకున్నారు కాబట్టి ఆ స్థానంలో విష్ణు ఎవరినైనా నియమించుకోవచ్చు. కానీ వెంటనే ఆ పని చేస్తే కొత్త విమర్శలు వచ్చి పడతాయి. ముందు ఏం చేయాలో తీక్షణంగా ఆలోచించాలి. ప్రచారంలో చేసినట్టు దూకుడుగా వెళ్లడం కరెక్ట్ కాదు. ఇప్పుడు పదవి ఉంది. దాని గౌరవం కాపాడాలంటే హుందాగా వెళ్ళాలి. అసలే మీడియా కాచుకుని ఉంది. ప్రతి విషయం భూతద్దంలో కనిపిస్తోంది. సో మా గొడవలు థ్రిల్లర్ ని మించిన రేంజ్ లో సాగుతున్న మాట వాస్తవం

Also Read : బాలయ్య VS రజినీకాంత్ తప్పేలా లేదు

Show comments