iDreamPost
android-app
ios-app

ఒకే నెలలో మంచు విష్ణు నుంచి రెండు సినిమాలు..

  • Published Jun 02, 2025 | 3:23 PM Updated Updated Jun 02, 2025 | 3:23 PM

Dhee Rerelese: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప జూన్ 27న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా విష్ణు కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన మూవీ కూడా మరోసారి థియేటర్స్ లో రాబోతుంది.

Dhee Rerelese: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప జూన్ 27న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా విష్ణు కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన మూవీ కూడా మరోసారి థియేటర్స్ లో రాబోతుంది.

  • Published Jun 02, 2025 | 3:23 PMUpdated Jun 02, 2025 | 3:23 PM
ఒకే నెలలో మంచు విష్ణు నుంచి రెండు సినిమాలు..

ప్రస్తుతం సినిమా థియేటర్స్ లో ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. టాలీవుడ్ లో ఎప్పటినుంచో రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రెండ్ స్టార్ట్ అయినా మొదట్లో చాలా రేర్ గా రీరిలీజ్ లు వస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు వీకెండ్ ని క్యాష్ చేసుకోడానికి ప్రతి రెండు మూడు వారాలకు పాత హిట్ చిత్రాలను బరిలోకి దింపుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఒకే నెలలో మంచు విష్ణు నుంచి రెండు సినిమాలు థియేటర్ లో రిలీజ్ అవ్వడం విశేషం.

జూన్ 27న విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప గ్రాండ్ రిలీజ్ ఉన్న సంగతి తెలిసిందే. మూవీ రిలీజ్ దగ్గరలో ఉండడంతో కన్నప్ప టీం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈలోపే విష్ణు మరో న్యూస్ షేర్ చేశాడు. మంచు విష్ణు కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ మూవీ ‘ఢీ’. ఈ సినిమాను రీరిలీజ్ చేయబోతున్నారట. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ కామిడి ఎంటర్టైనర్ ఎలాంటి సక్సెస్ అందుకుందో తెలియనిది కాదు. 2007 లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. ఇక ఇప్పుడు మరోసారి జూన్ 6 న ఢీ రీరిలీజ్ అవుతుంది. ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టడమే కాకుండా విష్ణుకి సక్సెస్ ను అందించింది. సినిమా వచ్చి ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇప్పటికి టెలివిజన్ ఛానెల్స్ లో మంచి టీఆర్పీ తెచ్చుకుంటుంది. అసలే రీరిలీజ్ లు అంటే ఆ సినిమాలోని ఐకానిక్ సీన్స్ ను రిక్రియేట్ చేస్తున్నారు అభిమానులు. మరి ఈ మూవీలో నుంచి ఎలాంటి సీన్స్ రిక్రియేట్ చేస్తారో చూడాలి. సో మొత్తానికి మరోసారి మంచు విష్ణు థియేటర్స్ ను ‘ఢీ’ కొట్టనున్నాడు. ఇది కనుక ఆకట్టుకుంటే కన్నప్పకు కాస్త జోష్ వస్తుందని చెప్పొచ్చు. మరి ఒకే నెలలో మంచు విష్ణు నుంచి రెండు సినిమాలు రావడంపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş