iDreamPost
android-app
ios-app

కన్నప్ప వెనక్కు వెళ్ళేదే లేదట..

  • Published Jun 04, 2025 | 11:30 AM Updated Updated Jun 04, 2025 | 11:30 AM

వాస్తవానికి ఇప్పటికి ఈ సినిమా వచ్చేసి సక్సెస్ గురించి మాట్లాడుకోవాల్సిన రోజులు. కానీ విఎఫ్ఎక్స్ వర్క్స్ , ఇంకొన్ని రీజన్స్ వలన ఈ సినిమా ఇప్పటివరకు వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా జూన్ 27న సినిమాను రిలీజ్ చేసేందుకు మంచి ముహూర్తం కుదిరింది

వాస్తవానికి ఇప్పటికి ఈ సినిమా వచ్చేసి సక్సెస్ గురించి మాట్లాడుకోవాల్సిన రోజులు. కానీ విఎఫ్ఎక్స్ వర్క్స్ , ఇంకొన్ని రీజన్స్ వలన ఈ సినిమా ఇప్పటివరకు వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా జూన్ 27న సినిమాను రిలీజ్ చేసేందుకు మంచి ముహూర్తం కుదిరింది

  • Published Jun 04, 2025 | 11:30 AMUpdated Jun 04, 2025 | 11:30 AM
కన్నప్ప వెనక్కు వెళ్ళేదే లేదట..

మంచు విష్ణు భారీ డ్రీం ప్రాజెక్ట్ గురించి ఇప్పటికే రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో ఇండస్ట్రీలోని ఎంతో మంది నటీ నటులు భాగం కాబోతున్నారు. కేవలం తెలుగు నటి నటులే కాకుండా వివిధ భాషల్లోని స్టార్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు . దీనితో ప్రతి ఒక్కరికి సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా తన కెరీర్ లో ఎప్పటికి గుర్తుండిపోయే ఓ సినిమాగా నిలిచిపోతుందని మంచు విష్ణు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

వాస్తవానికి ఇప్పటికి ఈ సినిమా వచ్చేసి సక్సెస్ గురించి మాట్లాడుకోవాల్సిన రోజులు. కానీ విఎఫ్ఎక్స్ వర్క్స్ , ఇంకొన్ని రీజన్స్ వలన ఈ సినిమా ఇప్పటివరకు వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా జూన్ 27న సినిమాను రిలీజ్ చేసేందుకు మంచి ముహూర్తం కుదిరింది. అందులో భాగంగా ఆల్రెడీ మేకర్స్ ప్రమోషన్స్ ప్లాన్ చేసే పనిలో ఉన్నారు. ఇక రీసెంట్ గా ఈ సినిమా హార్డ్ డిస్క్ కు సంబంధించి ఎలాంటి వివాదం నడిచిందో తెలియనిది కాదు. దీనితో సినిమా పోస్ట్ పోన్ అవుతుందనే రూమర్స్ మొదలయ్యాయి.

ఇలా సినిమా గురించి నెట్టింట జరుగుతున్న చర్చపై మంచు విష్ణు క్లారిటీ ఇచ్చాడు. కన్నప్ప సినిమా ఎట్టి పరిస్థితిలోను జూన్ 27న థియేటర్ లో రిలీజ్ అవుతుంది అని చాలా కాన్ఫిడెంట్ గా డేట్ లాక్ చేసాడు. ఆల్రెడీ తెలుగు స్టేట్స్ లో కన్నప్ప టీం ప్రమోషనల్ ఈవెంట్స్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తుందట. సో ఎట్టి పరిస్థితిలో ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఏ లేదని తెలుస్తుంది. ఇక సినిమాకు థియేటర్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbet