iDreamPost
android-app
ios-app

తెరపైకి మంచు విష్ణు కూతుళ్ళు అరియానా, వివియానా.. కన్నప్ప లో వీరు కూడా భాగమే!

  • Published Dec 02, 2024 | 2:02 PM Updated Updated Dec 02, 2024 | 2:02 PM

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ చిత్రం నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్ ఆడియెన్స్‌లో అంచనాలు పెంచేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ క్రమంలోనే అరియానా, వివియానా పుట్టిన రోజు సందర్భంగా సినిమాలోని వారి పాత్రలని పరిచయం చేశారు ‘కన్నప్ప’ టీం.

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ చిత్రం నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్ ఆడియెన్స్‌లో అంచనాలు పెంచేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ క్రమంలోనే అరియానా, వివియానా పుట్టిన రోజు సందర్భంగా సినిమాలోని వారి పాత్రలని పరిచయం చేశారు ‘కన్నప్ప’ టీం.

  • Published Dec 02, 2024 | 2:02 PMUpdated Dec 02, 2024 | 2:02 PM
తెరపైకి మంచు విష్ణు కూతుళ్ళు అరియానా, వివియానా..  కన్నప్ప లో వీరు కూడా భాగమే!

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ చిత్రం నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్ ఆడియెన్స్‌లో అంచనాలు పెంచేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. అత్యంత భారీ క్రేజీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ అయిన ఈ ‘కన్నప్ప’ ఏప్రిల్ 25, 2025న విడుదల కానుంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్‌ను సోమవారం నాడు రిలీజ్ చేశారు.కన్నప్ప ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతీ సోమవారం ఓ అప్డేట్ ఇస్తామని మేకర్లు ఇది వరకు ప్రకటించారు. ఇందులో భాగంగా విష్ణు మంచు పిల్లలు అరియానా మంచు, వివియానా మంచు ఫస్ట్ లుక్‌లను విడుదల చేశారు. అంతే కాకుండా ఈ రోజు విష్ణు మంచు కవల కుమార్తెల పుట్టినరోజులు కావడం కూడా విశేషం.

ఈ పోస్టర్‌లో పిల్లలిద్దరూ గిరిజన వేషధారణలో చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. శ్రీ కాళహస్తి పురాణ కథ ప్రాముఖ్యతను చాటి చెప్పే పాటలో కనిపించనున్నారు. ‘పాట పాడినా, నృత్యం చేసినా, ఇది శివుని కోసం’ అని ఈ పోస్టర్‌లో చూపించారు. ఈ మేరకు విష్ణు మంచు పోస్ట్ చేస్తూ.. ‘పుట్టినరోజు సందర్భంగా నా కుమార్తెల ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఈ క్షణంలో నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది. నా చిన్ని తల్లులు తెరపై సృష్టించే మ్యాజిక్‌ను చూసేందుకు నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు. ఇది వరకు కన్నప్ప నుంచి అవ్రామ్ లుక్‌ను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మోహన్ బాబు, శరత్ కుమార్, అర్పిత్ రాంక, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, ముఖేష్ రిషి, సప్తగిరి వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.

ఈ సినిమాపై మంచు అభిమానులకు చాలా అంచనాలు ఉన్నాయి. పైగా ఇలా ఒక్కొక్కటిగా ఈ సినిమాలోని క్యాస్టింగ్ గురించి బయటకు వస్తున్న వార్తలు.. సినిమాపై ఇంకాస్త క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. మంచి విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కావడంతో సినిమాపై ప్రత్యేకమైన శ్రద్ద వహిస్తున్నారు మేకర్స్. ప్రతి ఫ్రేమ్ ను చాలా జాగ్రత్తగా తీర్చి దిద్దుతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రివీల్ చేయనున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తాయో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetsezarcasinoJojobetJojobetjojobetJojobetjojobetJojobetcasibomfixbetfixbetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş