ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాకు ఒక కరోనా హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెల్లడించారు.ఇప్పుడు కేవలం రాష్ట్రస్థాయిలో నాలుగు కొవిడ్ ఆస్పత్రులు ఉన్నాయని తెలిపారు..
జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో 12వేల పీపీఈలు 20వేల ఎన్-95 మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయన
ని పేర్కొన్నారు. 20లక్షల పీపీఈల ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 40లక్షల గ్లవుజ్‌లు, 12లక్షల మాస్క్‌లు ఉన్నాయని తెలిపారు.
కాగా తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 304 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, తెలంగాణా లో 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశం మొత్తంలో 5020 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం…