విజయ్ దేవరకొండ S/O డాన్ ?

ఒకే తరహా ప్రేమ కథల మూసలో వెళ్తూ ఫ్లాపులు మూటగట్టుకుంటున్నాడన్న విమర్శలు ఎదుర్కుంటున్న విజయ్ దేవరకొండ ఎట్టకేలకు రూటు మార్చినట్టు ఫిలిం నగర్ టాక్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫైటర్/లైగర్ (ప్రచారంలో ఉన్న టైటిల్స్) లో హీరో పాత్ర డాన్ సెటప్ లో ఉంటుందట. అంటే తను మాఫియా లీడర్ కాకపోయినా తండ్రికి బాషా రేంజ్ లో బిల్డప్ ఉంటుందట అతనితో విభేదించి బయటికి వచ్చి తనకంటూ స్వంతంగా లైఫ్ ని లీడ్ చేస్తున్న టైంలో శత్రువులు టార్గెట్ చేయడాన్ని మెయిన్ లైన్ గా పూరి దీన్ని ప్లాన్ చేసుకున్నట్టుగా తెలిసింది.

ఇది నిజమో కాదో కాని ప్రచారమైతే గట్టిగానే ఉంది. ఇది వాస్తవమైతే గతంలో ఇలాంటి పాత్రలు స్టార్ హీరోలు చేశారు చిరంజీవి లంకేశ్వరుడు, బాలకృష్ణ యువరత్న రాణా, నాగార్జున నేటి సిద్దార్థ, వెంకటేష్ ధ్రువ నక్షత్రం ఇదే టైపు లో ఉంటాయి. విజయ్ దేవరకొండ అభిమానులు తమ హీరోను కొత్తగా చూడాలని కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టే పూరి జగన్నాథ్ తనదైన స్టైల్ లో దీని ట్రీట్మెంట్ ని తీర్చిదిద్దుతున్నట్టు చెబుతున్నారు. అనన్య పాండే హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే 40 శాతం దాకా అయ్యిందట.

ఒకవేళ కరోనా రాకపోయి ఉంటే ఈపాటికే మేజర్ షెడ్యూల్స్ అన్ని పూర్తయ్యేవని సమాచారం. పరిస్థితులు సద్దుమణిగాక ముంబైలో దీన్ని కొనసాగించే అవకాశం ఉంది. అయితే అక్కడ కరోనా మహమ్మారి చాలా తీవ్రంగా ఉన్న నేపధ్యంలో షూటింగ్స్ కి అనుమతులు అంత సులభంగా దొరక్కపోవచ్చు. ఒకవేళ అదే జరిగితే హైదరాబాద్ లేదా తెలుగు రాష్ట్రాల్లోనే వేరే లొకేషన్ లో తీయాల్సి ఉంటుంది. రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీ అంత సవ్యంగా జరిగితే ఈ ఏడాదే విడుదల ఉంటుంది లేకపోతే పోస్ట్ పోన్ తప్పదు. ఆ డాన్ పాత్ర వేస్తున్న నటుడు ఎవరో బయటికి రాలేదు కాని ప్రకాష్ రాజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. చూద్దాం.

Show comments