Dharani
Dharani
మెగా హీరో వరుణ్ తేజ్కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మాయిల కలల రాకుమారుడిలా మారాడు వరుణ్ తేజ్. ఎంత మంది అమ్మాయిలు తనను ప్రేమించారో లెక్కే లేదు. కానీ వరుణ్ తేజ్ మాత్రం.. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో పెళ్లికి రెడీ అయ్యాడు. ఇప్పటికే వీరిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. ఈవార్త విని చాలామంది అమ్మాయిల హృదయం ముక్కలయ్యింది. సామాన్య యువతులే కాక చాలా మంది యంగ్ హీరోయిన్స్ వరుణ్ తేజ్‌పై మనసు పారేసుకున్నారు. ఆ జాబితాలో తాను కూడా ఉన్నాను అంటుంది బుల్లి తెర నటి దీపా జగదీష్. ఈమె ఎవరు అనుకుంటున్నారా.. స్టార్ మాలో ప్రసారం అయ్యే మల్లి సీరియల్లో మాలిని పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ప్రస్తుతం నీతోనే డ్యాన్స్ షోలో తన భర్తతో కలిసి పాల్గొంటుంది. ఈ క్రమంలో దీప.. తన భర్త ముందే వరుణ్ తేజ్ మీద ఉన్న క్రష్‌ని బయటపెట్టింది. ఆ వివరాలు..
స్టార్ మాలో ప్రసారం అవుతోన్న మల్లి సీరియల్లో మాలిని అలియాస్ దీపా జగదీష్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గతేడాది ఆమె కన్నడ నిర్మాత, దర్శకడు సాగర్ పురాణిక్ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన భర్త విజయ్ ముందే తన క్రష్ గురించి చెప్పింది దీపా జగదీష్. ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. వరుణ్ తేజ్‌పై తనకున్న అభిమానాన్ని బయటపెట్టింది.
దీపా జగదీష్ మాట్లాడుతూ.. ‘‘మొన్న ఎంగేజ్మెంట్ చేసుకున్న వరుణ్ తేజ్ అంటే నాకు చాలా ఇష్టం. ‘ఫిదా’ సినిమా చూసి నేను నిజంగానే ఆయనకి ఫిదా అయిపోయాను. వరుణ్ తేజ్ హైట్ అంటే నాకు చాలా ఇష్టం. తనకు లావణ్య త్రిపాఠితో ఎంగేజ్మెంట్ అయిపోయింది కానీ.. లేదంటే నేనే చేసుకుందాం అనుకున్నా (నవ్వుతూ). ఇక టాలీవుడ్లో అల్లు అర్జున్, మహేష్ బాబు అంటే ఇష్టం. ఆర్య సినిమా అప్పటి నుంచి అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమాలో పాటలు చాలా ఇష్టం’’ అని చెప్పింది దీపా జగదీష్.
అయితే తాను పక్కనుండగానే వరుణ్ తేజ్‌ను పెళ్లి చేసుకుందామనుకున్నా అని దీపా జగదీష్ చెప్పడంతో.. ఆమె భర్త సాగర్ స్పందిస్తూ.. ‘‘చూస్తున్నా.. చూస్తున్నా.. నాతో పాటు ఆడియన్స్ కూడా చూస్తున్నారు’’ అని సెటైర్ వేయడంతో పెద్దగా నవ్వేసింది దీపా జగదీష్. ఇక వీళ్లిద్దరూ కలిసి.. స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న నీతోనే డాన్స్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీపా జగదీష్ కెరీర్ విషయానికి వస్తే.. ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ఆమె భర్త సాగర్ తండ్రి బ్యానర్లోనే. అదే సీరియల్లో దీపాకి జోడీగా నటించారు విజయ్ నటించారు. అలా మొదలైన వీరి స్నేహం ప్రేమగా మారి.. గత ఏడాది పెళ్లి పీటలు ఎక్కేట్టు చేసింది. అయితే వీళ్ల ప్రేమ పెళ్లికి ముందు దీపా ఫ్యామిలీ అభ్యంతరం చెప్పింది. కానీ వారు మాత్రం పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు దీపా-విజయ్‌లు.