Arjun Suravaram
కొందరు జీవితంలో ఎదురయ్యే సమస్యలకు చావే పరిష్కారంగా భావించి దారుణ నిర్ణయాలు తీసుకుంటారు. అలా వారు ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా రక్తం పంచుకున్న బిడ్డలను కూడా బలి తీసుకుంటారు.
కొందరు జీవితంలో ఎదురయ్యే సమస్యలకు చావే పరిష్కారంగా భావించి దారుణ నిర్ణయాలు తీసుకుంటారు. అలా వారు ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా రక్తం పంచుకున్న బిడ్డలను కూడా బలి తీసుకుంటారు.
Arjun Suravaram
నేటికాలంలో మనుషుల్లో ధైర్యం, సహనం, ఓర్పు అనేవి కొరడవుతున్నాయి. అందుకే జీవితంలో ఎదురయ్యే ప్రతి చిన్న సమస్యను పెద్దగా ఊహించుకుని భయపడిపోతున్నారు. అంతేకాక తమకే అన్ని కష్టాలు వచ్చాయనుకుని మానసికంగా కుంగిపోతుంటారు. ఈ క్రమంలోనే కొందరు చావే పరిష్కారంగా భావించి దారుణ నిర్ణయాలు తీసుకుంటారు. అలా వారు ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా రక్తం పంచుకున్న బిడ్డలను కూడా బలి తీసుకుంటారు. తాజాగా ఓ మహిళ దారుణానికి పాల్పడింది. జీవితంపై రక్తితో చెట్టుకు ఉరేసుకుని ఇద్దరు బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచుసకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఏపీలో కడప జిల్లా చెన్నూరు మండలం గొర్ల పుల్లయ్యగారి వీధికి చెందిన ఉమామహేశ్వరి అనే మహిళకు శ్రీహరి అనే వ్యక్తితో 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఫణి కుమార్(17), ధనలక్ష్మి(16) అనే ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. చాలా కాలం పాటు వారి సంసారం హాయిగానే సాగింది. గతకొంతకాలం నుంచి ఆ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమామహేశ్వరి తన ఇద్దరు పిల్లలను తీసుకుని భర్తకు దూరంగా ఉంటుంది. అదే ప్రాంతంలో వేరే చోట ఉమా మహేశ్వరి పిల్లలతో కలిసి నివాసం ఉంటుంది. ఇక వీరి గొడవలు కాస్తా కోర్టు వరకు వెళ్లాయి.
ఈ దంపతుల గొడవలకు సంబంధించి స్థానిక కోర్టులో కేసు నడుస్తోంది. ఇక కోర్టు కేసులతో పాటు భర్తకు దూరమయ్యాననే బాధతో ఉమ మహేశ్వరికి జీవితంపై విరక్తి ఏర్పడింది. చావాలని భావించింది. తొలుత రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ఇద్దరు పిల్లలను బయటకు తీసుకెళ్లింది. ఇదే సమయంలో ఉమమహేశ్వరి భర్త శ్రీహరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో ఉమామహేశ్వరి, ఆమె కుమారుడు, కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. వల్లూరు గ్రామంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని వారు ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడినట్లు సోమవారం పోలీసులు గుర్తించారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇటీవల కాలంలో ఆత్మహత్య ఘటన అనేకం చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వెలడైన తరువాత పలువురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడి వాళ్ల తల్లిదండ్రులకు విషాదం నింపారు. అలానే మరికొందరు జాబులు రాలేదని, పెళ్లికావడం లేదని, ఇతర కారణాలతో చావే పరిష్కారంగా భావిస్తున్నారు. అసలు చచ్చేంద ధైర్యమే ఉన్నప్పుడు జీవితంలో ఎదురయ్యే కష్టాలు పెద్ద లెక్క కాదని మేధావులు చెబుతుంటారు. ప్రతి సమస్యను భూతద్దంలో పెట్టి చూసి.. నిండు నూరెళ్ల జీవితాన్ని అర్ధాంతరంగాముగిస్తున్నారు. మరి..ఈ ఆత్మహత్యల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.