iDreamPost
android-app
ios-app

ఎప్పటికీ నిజం కాని కల – Nostalgia

  • Published Mar 26, 2020 | 8:33 AM Updated Updated Mar 26, 2020 | 8:33 AM
ఎప్పటికీ నిజం కాని కల – Nostalgia

ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల హయం తర్వాత కృష్ణ-శోభన్ బాబు-కృష్ణంరాజుల జమానా నడిచింది. తర్వాత చిరంజీవి వచ్చాక కమర్షియల్ లెక్కలకు రెక్కలు వచ్చాయి. మాస్ సూత్రాలకు కొత్త అర్థాలు తెలిశాయి. అదే టైంలో తెరంగేట్రం చేసిన ముగ్గురు సినీ వారసులు బాలకృష్ణ- నాగార్జున – వెంకటేష్ లు తమదైన శైలిలో విజయాలు అందుకుంటూ ఒక బ్రాండ్ ని ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు. ముఖ్యంగా 90వ దశకంలో ఈ నలుగురు హీరోలు ఎవరూ అందుకోలేనన్ని విజయాలు సొంతం చేసుకున్నారు.

బాలయ్య మల్టీ స్టారర్స్ గురించి ఆలోచించడం కానీ ఆ దిశగా ప్రయత్నాలు కానీ ఎప్పుడూ చేయలేదు. కానీ చిరు నాగ్ వెంకీ లు అడపాదడపా ఇతర హీరోల సినిమాలలో ఆడదడపా క్యామియోలు చేస్తూనే వచ్చారు. కానీ ఈ ముగ్గురు మాత్రం మల్టీ స్టారర్ చేయలేకపోయారు. వీళ్లకు సరిపడా కథను ఏ రచయిత దర్శకుడు చేయలేకపోయారు. నిజానికి ఆ టైంలో బాలీవుడ్ లో ముగ్గురు హీరోలకు సరిపడా మంచి సినిమాలు కొన్ని వచ్చాయి. అందులో చెప్పుకోవాల్సింది 1989లో విడుదలైన త్రిదేవ్ గురించి. సన్నీ డియోల్-జాకీ శ్రోఫ్- నసీరుద్దిన్ షా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ అప్పట్లో బ్లాక్ బస్టర్.

దీన్ని తెలుగులో ఈ ముగ్గురితో తీస్తే బాగుంటుందని కొందరు దర్శక నిర్మాతలు అనుకున్నారు కూడా. ట్రిపుల్ హీరోస్ ఉన్నా కూడా దర్శకుడు రాజీవ్ రాయ్ సమాన ప్రాధాన్యం ఇచ్చి అందరి అభిమానులను మెప్పించారు. కానీ తెలుగులో మాత్రం ఇలాంటి సాహసం ఎవరు చేయలేకపోయారు. ఇదే త్రిదేవ్ ని కొంతకాలం తర్వాత సుమన్-భానుచందర్-అరుణ్ పాండ్యన్ లతో నక్షత్ర పోరాటం పేరుతో రీమేక్ చేశారు కానీ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఒకవేళ తగిన జాగ్రత్తలు తీసుకుని చిరు-నాగ్-వెంకీలకు తగ్గట్టు మార్పులు చేసుకుని ఉంటే ఎన్ని అద్భుతాలు జరిగేవో. అంతే కొన్ని కలలు కంటాం కాని అవి స్క్రీన్ మీదే ఎప్పటికి నిజం కాలేవు ఈ త్రిమూర్తుల కలయికలాగా.