రాజమౌళి ఒక్కరికే సాధ్యమయ్యింది!

సి పుల్లయ్య లవకుశ, కెవి రెడ్డి మాయాబజార్, కె విశ్వనాథ్ శంకరాభరణం, రాఘవేంద్రరావు అడవిరాముడు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి కానీ ఇవేవి అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ రీచ్ తెచ్చుకున్నవి కావు. క్లాసిక్స్ గా నిలిచిపోయి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నాయి.

సి పుల్లయ్య లవకుశ, కెవి రెడ్డి మాయాబజార్, కె విశ్వనాథ్ శంకరాభరణం, రాఘవేంద్రరావు అడవిరాముడు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి కానీ ఇవేవి అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ రీచ్ తెచ్చుకున్నవి కావు. క్లాసిక్స్ గా నిలిచిపోయి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నాయి.

తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఎందరో దర్శకులు ఎన్నో అద్భుత దృశ్యకావ్యాలను ఆవిష్కరించారు. సి పుల్లయ్య లవకుశ, కెవి రెడ్డి మాయాబజార్, కె విశ్వనాథ్ శంకరాభరణం, రాఘవేంద్రరావు అడవిరాముడు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి కానీ ఇవేవి అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ రీచ్ తెచ్చుకున్నవి కావు. క్లాసిక్స్ గా నిలిచిపోయి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నాయి. వరల్డ్ వైడ్ రేంజ్ కు వెళ్లేందుకు కమల్ హాసన్, అమీర్ ఖాన్, శేఖర్ కపూర్ లాంటి లెజెండ్స్ ప్రయత్నాలు చేశారు కానీ అవేవీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి. కానీ ఒక్క రాజమౌళి మాత్రం తాను ఎంత గొప్ప స్టోరీ టెల్లరో ప్రపంచానికి మళ్ళీ మళ్ళీ చాటుతున్నాడు.

సుప్రసిద్ధ హాలీవుడ్ ఫిలిం ఫెస్టివల్ లో జక్కన్న సినిమాలను స్క్రీనింగ్ చేయబోవడం అరుదైన ఘనతగా చెప్పుకోవాలి. అదేదో ఆర్ఆర్ఆర్ ఒకటే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 11 దాకా జరిగే ఈ వేడుకలో దాంతో పాటు ఈగ, బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్, మగధీర, మర్యాదరామన్నలు ప్రదర్శించబోతున్నారు. విక్రమార్కుడు, సై లాంటి రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్స్ ని పరిగణనలోకి తీసుకోలేదు. విజువల్ ఎఫెక్ట్స్ సహాయంతో ఎమోషన్లు మిస్ కాకుండా కథలను ఎంత గొప్పగా చెప్పొచ్చో చెప్పడానికి ఉదాహరణలుగా నిలిచిన వాటికి బియాండ్ ఫస్ట్ పేరుతో జరిగే ఈవెంట్ లో ఈ గౌరవం దక్కనుంది.


రాజమౌళి స్వయంగా ఇందులో కొన్నింటికి హాజరు కాబోతున్నట్టు తెలిసింది. లాస్ యాంజిల్స్ లో జరిగే ఈ చిత్రోత్సవంలో ఆస్కార్ అవార్డు కమిటీ సభ్యులు కూడా వీక్షకుల్లో ఉంటారట. ఇంతకన్నా ఛాన్స్ ఏముంటుంది. స్టూడెంట్ నెంబర్ వన్ తో కెరీర్ మొదలుపెట్టి రెండో సినిమా సింహాద్రితో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన జక్కన్న ఇప్పటిదాకా ఇండియాలో అసలు ఫ్లాప్ ఎరుగని మొదటి డైరెక్టర్ గా చెప్పుకోవచ్చేమో. అందుకే రాబోయే మహేష్ బాబు మూవీ మీద ఇంకా స్క్రిప్ట్ లాక్ కాకుండా అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతున్నాయి. ఆర్ఆర్ఆర్ మీద ఇప్పటికీ సోషల్ మీడియాలో ప్రశంసలు, కాంప్లిమెంట్లు వస్తూనే ఉంటాయి. అందుకే ఆయన్ను ఇండియన్ స్పిల్ బర్గ్ అని ఊరికే అనలేదు

Show comments