iDreamPost
android-app
ios-app

మహేష్ ఫ్యాన్స్ బాబుని మర్చిపోవాల్సిందేనా ? SSMB 29 లో బిగ్ ట్విస్ట్!

  • Published Oct 18, 2024 | 5:51 PM Updated Updated Oct 18, 2024 | 5:51 PM

SSMB 29 New Update: ఎంత పని చేసావ్ జక్కన్న... ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ బాబు ని మర్చిపోవాల్సిందే. అసలే మహేష్ మూవీ ఇప్పట్లో రాదనీ ఫ్యాన్స్ ఫీల్ అవుతుంటే ఇప్పుడు జక్కన్న మరో ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటో చూసేద్దాం..

SSMB 29 New Update: ఎంత పని చేసావ్ జక్కన్న... ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ బాబు ని మర్చిపోవాల్సిందే. అసలే మహేష్ మూవీ ఇప్పట్లో రాదనీ ఫ్యాన్స్ ఫీల్ అవుతుంటే ఇప్పుడు జక్కన్న మరో ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటో చూసేద్దాం..

  • Published Oct 18, 2024 | 5:51 PMUpdated Oct 18, 2024 | 5:51 PM
మహేష్ ఫ్యాన్స్ బాబుని మర్చిపోవాల్సిందేనా ? SSMB 29 లో బిగ్  ట్విస్ట్!

మహేష్ బాబు- రాజమౌళి ఓ SSMB29. ఈ కథ రాయడానికి రెండేళ్లు పట్టిందంట. సినిమాను వచ్చే ఏడాది నుంచి స్టార్ట్ చేస్తారట. దానికోసం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయట. ఈ మాటలు తప్పితే సినిమా గురించి ఇంకా ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా రాలేదు. తన దర్శకత్వంతో విధ్వంసం సృష్టించే జక్కన్న.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఇచ్చిన అప్డేట్ ఇది. పైగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా. వీరిద్దరి కాంబినేషన్ లో ఇదే మొదటి మూవీ. ఒక్కసారి జక్కన్న చేతికి చిక్కితే.. ఇక ఆ హీరో ను కొంతకాలం మర్చిపోవాల్సిందే. కానీ ఆ ఎదురుచూపులు తగినట్లే అంతకు రెట్టింపు రేంజ్ లో ఆ హీరోను తెరపై దింపుతాడు. ఆల్రెడీ దానికి నిదర్శనాలు చూసేశాం. మహేష్ ఫ్యాన్స్ కూడా దీనికి ఫిక్స్ అయ్యారు. ఇప్పట్లో ఈ మూవీ రాదనీ ఓ పక్క ఫీల్ అవుతుంటే.. ఇప్పుడు జక్కన్న మరో ట్విస్ట్ ఇచ్చాడు.

నిజానికి అసలు ఇండస్ట్రీలో సిక్వెల్స్ ట్రెండ్ స్టార్ట్ అయిందే రాజమౌళితో. బాహుబలి పార్ట్ 1 లో ఇచ్చిన సస్పెన్స్ కు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు చెవులు కొరుక్కున్నారు. సరిగ్గా రెండేళ్ల తర్వాత ఆ సస్పెన్స్ కు సరైన న్యాయం చేశాడు. ఇక ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ ను దింపాడు. ఏమైందో ఏమో కానీ ఇది మాత్రం సింగిల్ పార్ట్ తోనే ముగించేశాడు. దీనితో ఫ్యాన్స్ హమ్మయ్య అనుకున్నారు. ఇదంతా సరే ఇప్పుడు అసలు ఈ సిక్వెల్ టాపిక్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా. ఎందుకంటే, రాజమౌళి మహేష్ తో తీయబోయే సినిమాను.. రెండు పార్ట్స్ గా డివైడ్ చేశాడట. అసలు మొదటి పార్ట్ ఏంటో.. కథ ఎలా ఉంటుందో ఇంకా ఎవరికీ తెలియదు. ఇంతలోపే ఈ సినిమా రెండు పార్ట్స్ అని బాంబు పేల్చాడు. దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, ఈ విషయం తెలిసిన తర్వాత అభిమానులు మాత్రం.. ఎంత పని చేశావ్ జక్కన్న, ఇదేం ట్విస్ట్ బాసు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ SSMB 29 అనే చాప్టర్ ఎంత వరకు కొనసాగుతుందో చూడాలి.

ఓ వైపు మహేష్ మాత్రం మునుపెన్నడూ లేని విధంగా.. తన లుక్స్ ను మార్చేశాడు. లాంగ్ హెయిర్ , గడ్డం , కండలు ఇలా చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఇటీవల సోషల్ మీడియాలో ఆ లుక్స్ కూడా తెగ వైరల్ అయ్యాయి. రాజమౌళి మహేష్ ను పట్టించుకోవడం లేదా అంటూ కామెంట్స్ కూడా చేశారు. కానీ నిజానికి ఇంకా లుక్స్ ఫైనల్ అవ్వలేదు. ఒక్కసారి లుక్స్ ఫైనల్ అయితే.. ఇక మహేష్ ను సినిమా రిలీజ్ టైం లోనే చూడాలి. మరి జక్కన్న ఇంకా ఎలాంటి ట్విస్ట్ లు ఇస్తాడో.. ఈ సినిమాలో ఇంకా ఎవరెవరిని దించుతాడో.. అసలు ఏం ప్లాన్ చేశాడో అసలు అర్ధం కావడంలేదని ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి జక్కన్న ఎలాంటి షాకింగ్ అప్డేట్స్ ఇస్తాడో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet Girişcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet GirişHoliganbetHoliganbet Giriş