iDreamPost
android-app
ios-app

జక్కన్న మాస్టర్ ప్లాన్.. మహేశ్ తో 3వేల కోట్ల టార్గెట్?

  • Published Oct 05, 2024 | 4:40 PM Updated Updated Oct 05, 2024 | 4:40 PM

Rajamouli- Mahesh Movie: టాలీవుడ్ లో జక్కన్న కు ఏ రేంజ్ లో హైప్ ఉందో తెలియనిది కాదు. ఇక ప్రస్తుతం జక్కన్న మహేష్ మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన పూర్తి విషయాలు చూసేద్దాం.

Rajamouli- Mahesh Movie: టాలీవుడ్ లో జక్కన్న కు ఏ రేంజ్ లో హైప్ ఉందో తెలియనిది కాదు. ఇక ప్రస్తుతం జక్కన్న మహేష్ మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన పూర్తి విషయాలు చూసేద్దాం.

  • Published Oct 05, 2024 | 4:40 PMUpdated Oct 05, 2024 | 4:40 PM
జక్కన్న మాస్టర్ ప్లాన్.. మహేశ్ తో 3వేల కోట్ల టార్గెట్?

కొడితే కుంభస్థలం బద్దల్లవ్వాల్సిందే అనుకుంటాడో.. లేదా తన సినిమాతో విధ్వంసం సృష్టించాలి అనుకుంటాడో తెలియదు కానీ.. జక్కన్న ప్లానింగ్ ఏ వేరు. సినిమాలో ప్రతి ఒక్కదాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాడు . ఒక్కసారి జక్కన్న ప్రాజెక్ట్ ఒప్పుకుంటే.. ఇక ఆ హీరోను ఎప్పటికి స్క్రీన్ మీద చూస్తామో ఎవరికి తెలియదు. కానీ కాస్త లేట్ అయినా..  కరెక్ట్ కట్ అవుట్ ని స్క్రీన్ మీద దింపుతాడు. పని విషయంలో చాలా కచ్చితంగా ఉంటాడని.. పని రాక్షసుడని ఇప్పటికే ఎంతో మంది నోటి నుంచి విన్నాము. పనిలో అంత పర్ఫెక్ట్ గా ఉన్నాడు కాబట్టే.. తన సినిమాలకు ఆ రేంజ్ లో రెస్పాన్స్ లభిస్తుంది. జక్కన్న చేతిలో పడితే ఆ హీరో దశ తిరగాల్సిందే. హిస్టరీలో గుర్తుండిపోయే హిట్స్ , మిస్టరీస్ ని సృష్టించే హింట్స్ ఇస్తూ ఉంటాడు జక్కన్న. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ తో సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి వసూళ్ల విషయంలో మహేష్ తో భారీ టార్గెట్ నే ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న.

సినిమాను పక్కా కొలతలతో తీయడం ఒకెత్తయితే.. దానిని మార్కెటింగ్ చేసి హైప్ పెంచడం మరొక ఎత్తు. ఈ రెండింటిలోనూ రాజమౌళి దిట్ట. దీనిని కొట్టే వారు ఇప్పటివరకు రాలేదు. ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ తో ఇది అందరికి అర్థమైంది. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను తీసి అందరిని మెప్పించాడు. రాజమౌళితో ఒక్క సినిమా అయినా చేయాలనీ.. చాలా మంది బాలీవుడ్ హీరోల కోరిక. బాలీవుడ్ లోనే కాదు.. సౌత్ లో కూడా ఇతర భాషల్లో స్టార్స్ రాజమౌళి కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. సాధారణంగానే రాజమౌళికి ఒక్కో సినిమాకు ఒక్కో టార్గెట్ ఉంటూ ఉంటుంది. ఇలా పక్కా లెక్కలతో ముందుకు వెళ్లే జక్కన్న.. ఈసారి ఏకంగా ఈసారి మహేష్ తో భారీ వసూళ్లను రాబట్టాలని ఫిక్స్ అయ్యాడట. ఇప్పటికే సినిమా కోసం మహేష్ లుక్ ను పూర్తిగా మార్చేశాడు. రీసెంట్ గా ఆ ఫోటోలు కూడా తెగ వైరల్ అయ్యాయి. చూడబోతుంటే జక్కన్న ఎదో గట్టిగానే ప్లాన్ చేశాడని అనుకున్నారు. కానీ, ఈ రేంజ్ ప్లానింగ్ ను మాత్రం ఊహించి ఉండరు. ఎందుకంటే ఈసారి జక్కన్న టార్గెట్ ఏకంగా 3 వేల కోట్లు.

ప్రస్తుతానికి 1200 కోట్లతో ప్రభాస్ నటించిన కల్కి సినిమా టాప్ లో ఉంది. రెండేళ్లు పూర్తయ్యే లోపు  ప్రభాస్ ఆ రికార్డ్ ను దాటేసి 2 వేల వరకు చేరిన ఆశ్చర్యం లేదు. అందుకే జక్కన్న ఏకంగా 3 వేల కోట్ల టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ఇదే కనుక జరిగితే జక్కన్న హిస్టరీలో ఇది మరో రికార్డ్ క్రియేట్ చేస్తుందని చెప్పి తీరాల్సిందే. పైగా ఈ సినిమాకు డబ్బింగ్ ను అన్ని భాషల్లోనూ మహేష్ తోనే చెప్పించాలని డిసైడ్ అయ్యాడట. అంతే కాకుండా ఈ సినిమాకు నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ ను పెట్టనున్నాడట జక్కన్న.. అలాగే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉన్నట్లు టాక్. పైగా ఈ సినిమా షూటింగ్ అంతా కూడా విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారట. టాలీవుడ్ లో ప్రమోషన్స్ గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎలాగూ జక్కన్న మార్కెట్ కు తిరుగులేదు. సో అందుకే ఇప్పుడు హాలీవుడ్ కు గురి పెట్టాడు జక్కన్న. ఇప్పటికే హాలీవుడ్ లో ప్రమోషన్స్ ఎలా చేయాలో కూడా ప్లాన్ ఫిక్స్ అయిందట. ఇక కొడితే 3 వేల కోట్లు వచ్చి పడాల్సిందే.

నిన్న ప్రశాంత్ నీల్ తారక్ తో మూడు వేల కోట్లు అన్నాడు.. ఈరోజు జక్కన్న మహేష్ తో 3 వేల కోట్లు అన్నాడు. ఇద్దరి టార్గెట్ చాలా గట్టిగా ఉంది. ఒకవేళ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. ఇండియన్ హిస్టరీలో ఈ దర్శకుల పేర్లు మోత మోగిపోతాయి. జక్కన్న సరిగ్గా ప్లాన్ చేశాడంటే 3 వేల కోట్లు ఈ దర్శకుడికి చాలా చిన్న విషయం. ఏమౌతుందో చూడాలి. ఇప్పటివరకు అయితే రాజమౌళి- మహేష్ కాంబోలో మూవీ అనే ఒక్క విషయం తప్ప.. ఇంకే అప్డేట్ లేదు. త్వరలో ఏమైనా అప్డేట్స్ వస్తాయేమో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş