iDreamPost
android-app
ios-app

జక్కన్న మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడా ! బాహుబలి 3 ఫిక్స్ అయిందా ?

  • Published Oct 17, 2024 | 5:38 PM Updated Updated Oct 17, 2024 | 5:38 PM

Bahubali Part 3: బాహుబలి సిరీస్ అనగానే అందరికి ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఈ సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే రెండు పార్ట్స్ గా ప్రేక్షకులను మెప్పించిన సినిమా.. ఇప్పుడు మూడో పార్ట్ రాబోతుందనే టాక్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Bahubali Part 3: బాహుబలి సిరీస్ అనగానే అందరికి ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఈ సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే రెండు పార్ట్స్ గా ప్రేక్షకులను మెప్పించిన సినిమా.. ఇప్పుడు మూడో పార్ట్ రాబోతుందనే టాక్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Oct 17, 2024 | 5:38 PMUpdated Oct 17, 2024 | 5:38 PM
జక్కన్న మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాడా ! బాహుబలి 3 ఫిక్స్ అయిందా ?

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ? 2015లో అందరికి ఇదే పెద్ద హాట్ టాపిక్. ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న అది. తర్వాత ఆ సస్పెన్స్ ను రివీల్ చేస్తూ బాహుబలి 2వ పార్ట్ ను ముగించాడు దర్శకుడు. ఇప్పటివరకు వచ్చిన తెలుగు సినిమాలలో బెస్ట్ సస్పెన్స్ ఎలిమెంట్ తో ఎండ్ చేసి.. సెకండ్ పార్ట్ కు సరైన న్యాయం చేసిన మూవీ అది. జక్కన్న చెక్కిన అద్భుతాలలో బాహుబలి ముందుంటుంది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఈ సిరీస్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. సినిమాల ప్రస్తావన వస్తే బాహుబలి కు ముందు బాహుబలి కి తర్వాత అని ప్రస్తావిస్తూ ఉంటారు. విమర్శకుల నుంచి ఎన్నో ప్రశంసలు అందుకున్న సినిమా ఇది. అంతే కాకుండా వందల కోట్ల మార్కెట్ చేసి ఇండియన్ సినిమాలకు కొత్త టార్గెట్ ను ఫిక్స్ చేసింది. ఆ సమయంలో ఈ సినిమా గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు.

తెలుగు సినిమా స్టాండర్డ్ ను ఇంటెర్నేషనల్ రేంజ్ కు తీసుకు వెళ్లిన సినిమా బాహుబలి . రాజమౌళి ఏంటో అందరికి తెలిసేలా చేసింది. ప్రభాస్ ను పాన్ ఇండియా స్టార్ ను చేసింది. ఆ తర్వాత ప్రభాస్ కు ఏ రకంగా క్రేజ్ పెరిగిందో తెలియనిది కాదు. ఇప్పుడు ప్రభాస్ బాలీవుడ్ హీరోలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. వందల కోట్ల నుంచి వేల కోట్ల వసూళ్లు రాబడుతున్నాడంటే అది కేవలం బాహుబలి పుణ్యమే అని చెప్పాలి. ఇదంతా సరే అందరికి తెలిసిన విషయమే. అయితే ఎప్పుడో ముగిసిపోయిన బాహుబలి హిస్టరీ గురించి మళ్ళీ డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇదంతా ఎందుకు అని ఆరా తీస్తే.. జక్కన్న బాహుబలిని మళ్ళీ మొదలు పెడుతున్నాడనే వార్తలు బయటకు వచ్చాయి. కంగువా సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ ను బయటపెట్టారు. కంగువా సిక్వెన్స్ ల మధ్య గ్యాప్ ను సమర్థిస్తూ.. బాహుబలి 3 టాపిక్ ను తీసుకుని వచ్చారు. కంగువా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. ఆయన మాట్లాడుతూ.. ‘గత వారం బాహుబలి మేకర్స్‌తో చర్చించాను. పార్ట్‌ 3 ప్లాన్‌ చేసే పనిలో ఉన్నారు. దానికంటే ముందు రెండు సినిమాలు ఉన్నాయి. వాటి తర్వాతే ‘కల్కి 2’, ‘సలార్‌ 2’ రిలీజ్‌ అవుతాయి’ అని అన్నారు.

దీనితో ఇప్పుడు ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా రాజమౌళి బాహుబలి 3 ప్రస్తావన తీసుకుని వచ్చారు. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ దీనిపై ఆసక్తిగా ఉన్నారని.. బాహుబలి చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలను మూడవ పార్ట్ లో చూపిస్తాం అని.. అయితే సినిమా రావడానికి మాత్రం చాలా సమయం పడుతుందని.. చెప్పుకొచ్చారు. ఒకవేళ ఇది కనుక నిజం అయితే మాత్రం ఈసారి వందలు కాదు… వేల కోట్ల వసూళ్లు రాబట్టడం పెద్ద విషయమేమి కాదు. ఇక ప్రస్తుతం జక్కన్న మహేష్ తో SSMB29 మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఇవన్నీ ఎప్పటికి కంప్లీట్ అవుతాయో చూడాలి. మరి బాహుబలి 3 రానుందనే విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş