iDreamPost
android-app
ios-app

మహేశ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే వార్త.. SSMB29 అప్ డేట్ వచ్చేసింది..

  • Published Oct 10, 2024 | 1:46 PM Updated Updated Oct 10, 2024 | 1:46 PM

Crazy Update On Rajamouli- Mahesh Babu Movie: రాజమౌళి- మహేశ్ బాబు సినిమా ఇంకా పట్టాలు ఎక్కకుండానే సంచలనంగా మారుతోంది. ఈ మూవీకి సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే అప్ డేట్స్ రావట్లేదు అంతే. ఇప్పుడు నిజంగానే ఒక క్రేజీ అప్ వచ్చేసింది.

Crazy Update On Rajamouli- Mahesh Babu Movie: రాజమౌళి- మహేశ్ బాబు సినిమా ఇంకా పట్టాలు ఎక్కకుండానే సంచలనంగా మారుతోంది. ఈ మూవీకి సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే అప్ డేట్స్ రావట్లేదు అంతే. ఇప్పుడు నిజంగానే ఒక క్రేజీ అప్ వచ్చేసింది.

  • Published Oct 10, 2024 | 1:46 PMUpdated Oct 10, 2024 | 1:46 PM
మహేశ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే వార్త.. SSMB29 అప్ డేట్ వచ్చేసింది..

సూపర్ స్టార్ మహేశ్ బాబు నుంచి కొత్త సినిమా రావాలి అంటే.. కనీసం మూడేళ్లు పట్టేలాగే ఉంది. దర్శకధీరుడు రాజమౌళి చేతితో పడ్డాక ఆ మాత్రం ఎదురుచూడాల్సిందే. ఈ మూవీతో మహేశ్ పాన్ ఇండియా కాదు.. ఏకంగా పాన్ వరల్డ్ స్టార్ గా మారబోతున్నాడు. రాజమౌళి ఈసారి పెద్ద ప్లానింగే చేస్తున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ గురించి మాట్లాడుకోవడం కాదు.. ఏకంగా హాలీవుడ్ కూడా టాలీవుడ్ ని చూసి ముక్కున వేలేసుకునేలా ప్లానింగ్ కనిపిస్తోంది. ఇదంతా బాగానే ఉంది గానీ.. మూవీ అనౌన్స్ మెంట్ తప్పితే ఎలాంటి అప్ డేట్ లేదు. మహేశ్ ఫ్యాన్స్ అయితే సినిమా రిలీజ్ సంగతి పక్కన పెట్టండి.. అసలు ఎప్పుడు పట్టాలెక్కుతుందో చెప్పండి అంటూ వేడుకుంటున్నారు. ఇప్పుడు అందరి ప్రశ్నలకు సమాధానం వచ్చేసింది. సినిమాకి సంబంధించి వచ్చిన క్రేజీ అప్ డేట్ మహేశ్ ఫ్యాన్స్ కి కిక్కిస్తోంది. నిజానికి వచ్చింది చిన్న అప్ డేట్. కానీ, మహేశ్ ఫ్యాన్స్ సంబరాలు చూస్తే సినిమా విడుదల అవుతోందేమో అనుకుంటారు. మరి.. ఆ అప్ డేట్ ఏంటి? ఎందుకు ఫ్యాన్స్ అంత హ్యాపీగా ఉన్నారో చూద్దాం.

మహేశ్ బాబు ఫ్యాన్స్ ని చూస్తే చాలామందికి జాలేస్తోంది. ఎందుకంటే సినిమా అనౌన్స్ చేశాక ఎలాంటి అప్ డేట్ లేదు. ఏవో చిన్న చిన్న గాసిప్స్ తప్పితే జోష్ నింపే ఒక్క అప్ డేట్ రాలేదు. రాజమౌళిని చూస్తే ఈ సినిమాలో తలమునకలై ఉన్నాడు. గత రెండేళ్లుగా జక్కన్న ఈ చిత్రం మీదే కూర్చున్నాడు. మరోవైపు మహేశ్ బాబు 10 నెలలుగా మేకోవర్ కోసం కష్టపడుతున్నాడు. ఇప్పటికే మహేశ్ లుక్స్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. గుబురు గడ్డం, ఒత్తైన జుట్టు, మీసకట్టుతో భలే ఉన్నాడు అని సంబర పడుతున్నారు. అయితే అది మహేశ్ బాబు మూవీ లుక్ కాదు అని తెలుస్తోంది. ఇంకా మేకోవర్ పనులు స్టార్ట్ కాలేదు అనేది టాక్.

ఇప్పుడు మహేశ్ ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉంది అంటే.. అప్ డేట్స్ సంగతి పక్కన పెట్టండి. కనీసం సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చెప్పండి అనే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు ఆ ప్రశ్నకు నేరుగా మూవీ రచయితే సమాధానం చెప్పారు. అవును.. దిగ్గజ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేశారు. మహేశ్ బాబు- రాజమౌళి కాంబోలో వస్తున్న SSMB29 చిత్రం షూటింగ్ 2025 జనవరిలో స్టార్ట్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఈ వార్త విన్న తర్వాత మహేశ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఒక్కసారి పట్టాలెక్కితే చాలు.. అప్ డేట్స్ వస్తాయి అంటూ సంబరపడిపోతున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

విజయేంద్ర ప్రసాద్ కి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా చెబుతున్నారు. ఇంక మహేశ్- జక్కన్న కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై భారీగానే అంచనాలు ఉన్నాయి. అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని ఇప్పటికే వెల్లడించారు. అంతేకాకుండా.. ఈ చిత్రానికి సంబంధించి చాలానే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో మహేశ్ డ్యూయల్ రోల్ అని కూడా కొందరు చెబుతున్నారు. హీరోగానే కాకుండా.. నెగిటివ్ రోల్ లో కూడా మహేశ్ కనిపించబోతున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా.. SSMB29 చిత్రంలో హాలీవుడ్ నటులు కూడా ఉంటారు అని గట్టిగానే టాక్ వచ్చింది. మరి.. మహేశ్- జక్కన్న చిత్రం వచ్చే జనవరిలో స్టార్ట్ కాబోతోంది అనడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş