iDreamPost
android-app
ios-app

వకీల్ సాబ్ కు కొత్త షాక్

  • Published Apr 10, 2020 | 7:50 AM Updated Updated Apr 10, 2020 | 7:50 AM
  • Published Apr 10, 2020 | 7:50 AMUpdated Apr 10, 2020 | 7:50 AM
వకీల్ సాబ్ కు కొత్త షాక్

పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ షూటింగ్ కొత్త కొత్త మలుపులు తిరుగుతోంది . కరోనా వల్ల ఇంకొంచమే ఉన్న బాలన్స్ పార్ట్ అర్దాంతరంగా ఆగిపోయింది. మేలో రిలీజ్ అనుకుంటే ఇప్పుడు ఏకంగా ఆగస్ట్ కు వెళ్ళడం ఖాయంగా కనిపిస్తోంది. దిల్ రాజు ఇప్పటికే దీనికి సంబంధించి ప్రెజర్ లో ఉన్నారు. ఇదిలా ఉండగా వకీల్ సాబ్ యూనిట్ కి మరో ట్విస్ట్ తగిలింది. ఇందులో ఫ్లాష్ బ్యాక్ పార్ట్ లో పవన్ భార్యగా శృతి హాసన్ కనిపిస్తుందని గత రెండు నెలలుగా ఏదో ఒక మీడియాలో వినిపిస్తూనే ఉంది. సరే గబ్బర్ సింగ్ కాంబినేషన్ కదా బాగుంటుందిలే అని ఫ్యాన్స్ కూడా సంబరపడ్డారు.

కాని శృతి హాసన్ మాత్రం అదేమీ లేదంటూ కొత్త షాక్ ఇచ్చింది. వకీల్ సాబ్ ఆఫర్ కన్ఫర్మ్ కాలేదని వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయిందని తాను అందులో భాగమే అన్న వార్తలు శుద్ధ అబద్దమని తేల్చి చెప్పేసింది. సో శృతి వకీల్ సాబ్ చేయడం దాదాపు లేనట్టే. ఇప్పుడు దర్శకుడు వేణు శ్రీరామ్ కొత్త ఆప్షన్ వెతుక్కోవాలి. ఒకవేళ ఇది కమర్షియల్ సబ్జెక్టు అయితే పని ఈజీ అయ్యేది. కాని వకీల్ సాబ్ పింక్ రీమేక్. గ్లామర్ హంగులు, మసాలా సాంగులు లాంటివేవి ఉండకపోవచ్చు. అలాంటప్పుడు లిమిటెడ్ టైం మాత్రమే కనిపించే ఈ పాత్రను ఇప్పుడు ఫాంలో ఉన్న హీరొయిన్లు ఒప్పుకునే అవకాశాలు తక్కువ.

అసలే టాలీవుడ్ లో బ్యూటీల కొరత విపరీతంగా ఉంది. ఈ కారణంగానే చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్లు తమ జోడిని సెట్ చేసుకునే విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇటీవలే ఆచార్యలో తాను లేనని సోషల్ మీడియా ద్వారా త్రిష ప్రకటించినట్టే ఇప్పుడు వకీల్ సాబ్ లో నేను లేనని శృతి హాసన్ చెప్పడం కాకతాళీయమే అయినా ఇది అన్నదమ్ముల సినిమాలకు జరగడం విశేషం. కరోనా వెళ్ళిపోయి పరిస్థితి నార్మల్ అయ్యే వరకు తెలుగు సినిమాలకు సంబంధించి ఇలాంటి కన్ఫ్యూజన్లు తీరడం ఇప్పట్లో జరిగే పనిలా కనిపించడం లేదు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom