iDreamPost
android-app
ios-app

చిరుకి ఆ ఆలోచన సాహసమే

  • Published May 07, 2020 | 5:31 AM Updated Updated May 07, 2020 | 5:31 AM
చిరుకి ఆ ఆలోచన సాహసమే

ఆచార్య షూటింగ్ కు లాక్ డౌన్ వల్ల బ్రేక్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఒకవైపు సిసిసి పనులతో పాటు లూసిఫర్ రీమేక్ తాలూకు స్క్రిప్ట్ వ్యవహారాలు కూడా చూసుకుంటున్నారు. ఇదిలా ఉండగా గత కొద్దిరోజుల నుంచి చిరు త్వరలో వెబ్ సిరీస్ లో నటించే అవకాశం ఉందంటూ దాని కోసం ఆహా ప్లాట్ ఫార్మ్ ఏర్పాట్లు చేస్తోందనే వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే దీని గురించి అధికారిక ప్రకటన అయితే ఇంకా వెలువడలేదు. నిజానికి ఈ స్టేజిలో ఈయన ఈ బుల్లితెర ప్రయత్నం చేయడం అవసరమా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

గతంలో స్టార్ మా ఛానల్ లో మీలో ఎవరు కోటీశ్వరుడు చేసినప్పుడు నాగార్జున స్థాయిలో చిరు ఫీడ్ బ్యాక్ తెచ్చుకోలేకపోయారు. ఉన్నంతలో షో బాగానే నడిపినప్పటికీ రేటింగ్స్ పరంగా ఆ షో మరీ అద్భుతాలు చేయలేకపోయింది. అభిమానులు సైతం తమ హీరోని వెండితెరమీద తప్ప ఇలా టీవీలో యాంకర్ గా చూడాలనుకోవడం లేదని అభిప్రాయం వెలిబుచ్చారు. ఇప్పుడు ఒకవేళ వెబ్ సిరీస్ అంటే చిరంజీకి స్థాయి నటుడిగా సరిపోయే గ్రౌండ్ కాదని చెప్పొచ్చు. ఇప్పటికీ డిజిటల్ స్ట్రీమింగ్ అనేది ఇండియాలో ఇంకా ఎదుగుదల దశలోనే ఉంది.

అందులోనూ సౌత్ లో ఇప్పుడిప్పుడే జనం అలవాటు పడుతున్నారు. అలాంటప్ప్పుడు చిరంజీవి చేసినా అందరు ఎగబడి చూస్తారన్న గ్యారెంటీ లేదు. అందులోనూ సినిమా గ్లామర్ ఇచ్చే కిక్ ఇంకే రంగం ఇవ్వదనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. చిరు స్వయంగా దీని గురించి చెబితే తప్ప ఖచ్చితంగా నిర్ధారించలేని పరిస్థితి. ఈ మధ్య ఊహించని విధంగా తనతో చేయబోయే దర్శకుల పేర్లు షాక్ కలిగించేలా చెబుతున్న చిరు ఇప్పుడీ ఓటిటి విషయంలో కూడా ఏదైనా సర్ప్రైజ్ ఇస్తారేమో అనే అనుమానం లేకపోలేదు. ఇప్పటిదాకా వెబ్ సిరీస్ లో టాలీవుడ్ నుంచి వెళ్లిన వాళ్లలో చెప్పుకోదగిన వాళ్ళలో జగపతిబాబు, శ్రీకాంత్ లాంటి అతికొద్ది మందే ఉన్నారు. మరి చిరంజీవి నిజంగా అలాంటి సాహసం చేస్తారా.