iDreamPost
android-app
ios-app

కష్ట కాలంలో ఉపసమనం.. ఆర్బీఐ కీలక ప్రకటన

కష్ట కాలంలో ఉపసమనం.. ఆర్బీఐ కీలక ప్రకటన

కరోనా వైరస్‌ ప్రభావంతో అష్టదిగ్భందనంలో చిక్కుకున్న ఆర్థిక వ్యవస్థకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఉపసమన చర్యలు చేపట్టింది. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడకుండా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్బీఐ గవర్న్‌ర్‌ శక్తికాంత్‌ దాస్‌ పలు నిర్ణయాలను కొద్దిసేపటి క్రితం వెల్లడించారు.

రెపో రేట్‌ను 5.5 శాతం నుంచి 4.4 శాతానికి తగ్గించారు. ఈ నిర్ణయం బ్యాంకులు ఆర్బీఐ నుంచి రుణాలు తీసుకునేందుకు దోహదం చేస్తుంది. తక్కువ వడ్డీ రేటుతో బ్యాంకులు ఆర్బీఐ నుంచి రుణాలు పొందడం వల్ల.. ప్రజలకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందిస్తుంది. వడ్డీ రేట్ల తక్కువగా ఉండడంతో ప్రజలు రుణాలు తీసుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఇలా నగదు మార్కెట్‌లోకి వస్తుంది. తద్వారా లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కుతారు.

రెపో రేటుతోపాటు ఆర్బీఐ మరో నిర్ణయం కూడా తీసుకుంది. రివర్స్‌ రెపో రేటును 4 శాతానికి తగ్గించింది. ఆర్బీఐ కొన్ని సందర్భాల్లో వాణిజ్య బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటుంది. ఆ రుణాలపై ఇచ్చే వడ్డీ రేటును రివర్స్‌ రేపో రేటు అంటాం. కొన్ని బ్యాంకుల వద్ద అధిక మొత్తంలో నగదు ఉంటే.. ఆ నగదును రుణంగా ఆర్బీఐకి ఇవ్వవచ్చు. ఆర్బీఐ కూడా రుణాలను తీసుకునేందుకు ఆసక్తి చూపుతుంది. రుణాల ద్వారా తీసుకున్న నగదును.. అవసరమైన వాణిజ్య బ్యాంకులకు రుణంగా ఇస్తుంది. ఇలా ఇచ్చిన రుణంపై ఆయా బ్యాంకుల నుంచి ఆర్బీఐ వడ్డీని వసూలు చేస్తుంది. ఎంత వడ్డి తీసుకోవాలన్నది నిర్ణయించేదే రివర్స్‌ రెపో రేటు.

రెపో రేటు ఎప్పుడూ రివర్స్‌ రెపో రేటు కన్నా ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రెపో రేటు(బ్యాంకులు ఆర్బీఐకి చెల్లించే వడ్డీ శాతం) 4.4 శాతం ఉండగా, రివర్స్‌ రెపో రేటు(ఆర్బీఐ బ్యాంకులకు చెల్లించే వడ్డీ శాతం) 4 శాతం ఉంది.

రుణ గ్రహీతలకు ఆర్బీఐ ఉపసమనం కలిగించే ప్రకటన చేసింది. ఎవ్రీ మంత్‌ ఇన్సా›్టల్‌మెంట్‌ (ఈఎంఐ)లపై మూడు నెలల మారటోరియం విధించింది. మార్చి నుంచి మూడు నెలల పాటు మారటోరియం అమలవుతుంది.