Swetha
యాక్షన్ ఎలివేషన్స్ , లవ్ , డ్రామా లాంటి కంటెంట్ కు ఓటిటి లో ఆదరణ బాగానే లభిస్తూ ఉంటుంది. అలాగే సోషల్ మెసేజ్ సినిమాలు మాత్రం కాస్త లేట్ గా హైలెట్ అవుతూ ఉంటాయి. అలా డైరెక్టర్ దేవ కట్ట నుంచి ప్రస్థానం ,ఆటోనగర్ సూర్య లాంటి సోషల్ డ్రామా కంటెంట్ వచ్చి పరవాలేదు అనిపించుకున్నాయి.
యాక్షన్ ఎలివేషన్స్ , లవ్ , డ్రామా లాంటి కంటెంట్ కు ఓటిటి లో ఆదరణ బాగానే లభిస్తూ ఉంటుంది. అలాగే సోషల్ మెసేజ్ సినిమాలు మాత్రం కాస్త లేట్ గా హైలెట్ అవుతూ ఉంటాయి. అలా డైరెక్టర్ దేవ కట్ట నుంచి ప్రస్థానం ,ఆటోనగర్ సూర్య లాంటి సోషల్ డ్రామా కంటెంట్ వచ్చి పరవాలేదు అనిపించుకున్నాయి.
Swetha
యాక్షన్ ఎలివేషన్స్ , లవ్ , డ్రామా లాంటి కంటెంట్ కు ఓటిటి లో ఆదరణ బాగానే లభిస్తూ ఉంటుంది. అలాగే సోషల్ మెసేజ్ సినిమాలు మాత్రం కాస్త లేట్ గా హైలెట్ అవుతూ ఉంటాయి. అలా డైరెక్టర్ దేవ కట్ట నుంచి ప్రస్థానం ,ఆటోనగర్ సూర్య లాంటి సోషల్ డ్రామా కంటెంట్ వచ్చి పరవాలేదు అనిపించుకున్నాయి. ఇప్పుడు అదే డైరెక్టర్ పొలిటికల్ బ్యాక్డ్రాప్ లో మయసభ అనే వెబ్ సిరీస్ తో వచ్చాడు. దివంగత నేత YS రాజశేఖర్ రెడ్డి , నారా చంద్రబాబుల మధ్య స్నేహాన్ని ఆధారంగా తీసుకుని ఈ సిరీస్ కథను రాసుకున్నారు. అయితే దీని నుంచి వివాదాలు వచ్చే అవకాశం ఉన్నట్లు ముందు నుంచే కాస్త సందేహాలు ఉన్నాయి.
మయసభ కథ విషయానికొస్తే.. కృష్ణమనాయుడు, ఎంఎస్ రామిరెడ్డి ఇద్దరు కాలేజీ రోజుల నుంచి స్నేహితులు. ఒకరు పిహెచ్డి స్కాలర్ గా , మరొకరు ఎంబిబిఎస్ స్టూడెంట్ గా కెరీర్ లో ఎదుగుతారు. ఇద్దరికీ అభ్యుదయ భావాలూ , సమాజం పట్ల గౌరవం ఉండడంతో.. ఇద్దరు ఒకేసారి రాజకీయ ప్రయాణం మొదలుపెడతారు. వీరి ప్రయాణంలో తెలుగు ప్రజలు దేవుడిగా భావించే సినీ స్టార్ ఆర్ సిఆర్ భాగం అవుతారు. 1975 కాలంలో జరిగిన రాజకీయ పరిణామాలతో పాటు .. దేశాన్ని ఒక ఊపు ఊపేసిన ఆ కాలం నాటి పరిస్థితిలు , ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయాలు , మారణకాండ లాంటి ఎన్నో ఘట్టాలను ఈ సిరీస్ లో చూపించారు.
మరి ఇది ఎంత వరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో తెలియదు. కానీ వివాదాలకు దారి తీసే కొన్ని అంశాలు కూడా ఈ సిరీస్ లో ఉన్నాయి. కృష్ణమనాయుడు యంగ్ ఏజ్ లో ఉండగా ఓ లవ్ స్టోరీ ఉండడం.. ఎంఎస్ఆర్ ఓ అమ్మాయిని ప్రేమించి దొంగతనంగా పెళ్లి చేసుకోడం.. కులాల ముసుగులో విజయవాడలో జరిగిన ఘటనలు.. ఎవరి వలన ఎవరికీ పదవులు దక్కాయి అనే దానిని ప్రొజెక్ట్ చేసిన విధానం లాంటివి హాట్ టాపిక్ గా మారబోతున్నాయి. సో వాచ్ ఓవర్లు పెరిగే కొద్దీ.. వివాదాలు పెరిగే అవకాశం లేకపోలేదు. ఈ సిరీస్ ప్రస్తుతం సోనీలివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరీ ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.