iDreamPost
android-app
ios-app

స్వీటీ ‘ఘాటీ’ సామ్రాజ్యం.. బాగానే మెప్పించింది

  • Published Aug 07, 2025 | 10:28 AM Updated Updated Aug 07, 2025 | 10:28 AM

డైరెక్టర్ క్రిష్ ఈసారి కంప్లీట్ గా మాస్ టర్న్ తీసుకున్నాడు. ఇప్పటివరకు క్రిష్ తీసిన సినిమాలకు ఈ సినిమాకు అసలు పోలిక ఉండదు. ఎప్పటికప్పుడు కొత్తదనంతో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు క్రిష్. ఇప్పుడు అదే ప్రయోగం అనుష్కతో చేస్తున్నాడు. ఎప్పటినుంచో పెండింగ్ లో ఆగిపోయిన అనుష్క ఘాటీ మూవీ ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేశారు మేకర్స్

  • Published Aug 07, 2025 | 10:28 AMUpdated Aug 07, 2025 | 10:28 AM
స్వీటీ ‘ఘాటీ’ సామ్రాజ్యం.. బాగానే మెప్పించింది

డైరెక్టర్ క్రిష్ ఈసారి కంప్లీట్ గా మాస్ టర్న్ తీసుకున్నాడు. ఇప్పటివరకు క్రిష్ తీసిన సినిమాలకు ఈ సినిమాకు అసలు పోలిక ఉండదు. ఎప్పటికప్పుడు కొత్తదనంతో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు క్రిష్. ఇప్పుడు అదే ప్రయోగం అనుష్కతో చేస్తున్నాడు. ఎప్పటినుంచో పెండింగ్ లో ఆగిపోయిన అనుష్క ఘాటీ మూవీ ట్రైలర్ ను నిన్న రిలీజ్ చేశారు మేకర్స్. అనుష్క క్రిష్ కాంబినేషన్ , అనుష్క మాస్ వైలెంట్ వెర్షన్.. ఇవన్నీ చూసి సినిమా మీద బాగానే అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు ట్రైలర్ విషయానికొస్తే…

కాలాన్ని కాస్త వెనక్కు తీసుకుని వెళ్లి చూపించాడు క్రిష్. బ్రిటిషర్లు కాలంలో ఘాటీ అనే తెగ వారు ఉండేవారు. వారు ఎంతటి ఎత్తైన కొండలనైనా సునాయాసంగా ఎక్కేస్తారనే పేరు ఉంది. ఈ తెగకు చెందిన వారు ఆడ మెగా తేడా లేకుండా ఎంతటి ప్రమాదాన్నైనా ఎదుర్కుంటారు. వాళ్లలో అనుష్క విక్రమ్ ప్రభుల జంట కూడా ఒకరు. అదే సమాజంలో రోజు రోజుకి గంజాయి వ్యాపారం అడ్డు అదుపు లేకుండా పెరుగుతూ పోతుంది. ఈ క్రమంలో ఘాటిల్లో తిరుగుబాటు మొదలవుతుంది. దాని వలన అమాయకుల ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. మరి ఘాటీ ప్రజలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. అక్కడ దొరలూ ఏమైయ్యారు. ఇవన్నీ తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే

నిజానికి ఘాటీ ట్రైలర్ రావడం అయితే ఆలస్యం అయింది కానీ.. పక్కా ప్రామిసింగ్ కంటెంట్ తోనే వచ్చింది. మెయిన్ గా అనుష్క క్యారెక్టర్ ఇక్కడ కమర్షియల్ గా బాగా వర్కౌట్ అయ్యేలా ఉంది. సీత చేసే లంకా దహనం చూస్తారు అనే డైలాగ్ తో సినిమా సారాంశం ఏంటో క్లియర్ గా అర్థమైపోతుంది. సో సీతా ఎలా చేస్తుందో సెప్టెంబర్ 5 న వెండితెరపై చూడాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.