Swetha
ఓటిటి సెర్చ్ లిస్ట్ లో ఎప్పుడు ముందుండేవి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలే. ప్రతి క్షణం మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ లతో.. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఆద్యతం ఉత్కంఠభరితంగా సాగుతూ.. ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియెన్స్ ఇస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాల లిస్ట్ ఇంకా పెరిగిపోయింది
ఓటిటి సెర్చ్ లిస్ట్ లో ఎప్పుడు ముందుండేవి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలే. ప్రతి క్షణం మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ లతో.. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఆద్యతం ఉత్కంఠభరితంగా సాగుతూ.. ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియెన్స్ ఇస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాల లిస్ట్ ఇంకా పెరిగిపోయింది
Swetha
ఓటిటి సెర్చ్ లిస్ట్ లో ఎప్పుడు ముందుండేవి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలే. ప్రతి క్షణం మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ లతో.. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఆద్యతం ఉత్కంఠభరితంగా సాగుతూ.. ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియెన్స్ ఇస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమాల లిస్ట్ ఇంకా పెరిగిపోయింది. లాంగ్వేజ్ ఏదైనా సరే కంటెంట్ బావుంటే ఆ సినిమాను చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు ప్రేక్షకులు. ఈ క్రమంలో ఇప్పుడు ఓ తమిళ మూవీ ఒకటి ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమా కథేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.
ఈ సినిమా కథ విషయానికొస్తే… ఓసారి ఓ ఇద్దరు ప్రాణ స్నేహితులు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ ను తీసుకుని ఓ ఫారెస్ట్ లోనికి వెళ్తారు. అక్కడే ఓ రోజంతా సరదాగా గడపడాలని అనుకుంటారు. ఇక ఆ రాత్రి అక్కడే ఉండడం కోసం అడవిలోని ఓ బంగ్లాలోకి వెళ్తారు. అంతా బాగానే ఉంది అనుకునే క్రమంలో అందులో ఒకళ్ళ గర్ల్ ఫ్రెండ్ హత్యకు గురవుతుంది. ఆమె ఎలా హత్యకు గురైంది అనే విషయం ఎవరికీ తెలియదు. డెడ్ బాడీ వాళ్ళతోనే ఉంటుంది. అసలు ఆమెను చంపింది ఎవరు ? ఆ బంగ్లాలో ఏముంది ? మిగిలిన వాళ్ళు బాగానే ఉన్నారా లేదా ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ సినిమా పేరు ‘యాదుమ్ అరియాన్’. ఈ సినిమా ప్రస్తుతానికి తెలుగులో అయితే అందుబాటులో లేదు. కేవలం తమిళ్ లో మాత్రమే స్ట్రీమింగ్ కాబోతుంది. లాంగ్వేజ్ తో సంబంధం లేదు. కంటెంట్ బావుంటే చాలు అనుకునే వాళ్ళు ఈ సినిమా ట్రై చేయొచ్చు. ఆగస్టు 8 నుంచి ఆహా తమిళ్ లో సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. కాబట్టి ఈ వీకెండ్ ఈ సినిమాను అసలు మిస్ చేయకుండా చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.