iDreamPost
android-app
ios-app

సుధీర్ బాబు ప్లాన్ ఈసారైనా ఫలిస్తుందా !

  • Published Aug 08, 2025 | 4:52 PM Updated Updated Aug 08, 2025 | 4:52 PM

ఇండస్ట్రీలో వారసత్వం కొనసాగుతూనే ఉంటుంది. ఓ హీరోకు సంబందించిన కుటుంబ సభ్యులు వస్తూనే ఉంటారు. అలా సపోర్ట్ తో వచ్చినా కానీ ఆ హీరోకంటూ ఓ హిట్ పడితేనే ప్రేక్షకులలో రిజిస్టర్ అవుతాడు. ఆ హీరోలకు బ్యాక్ గ్రౌండ్ లో ఎంత సపోర్ట్ ఉన్నా సరే.. కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించాడా లేదా అనేదే అసలు పాయింట్.

ఇండస్ట్రీలో వారసత్వం కొనసాగుతూనే ఉంటుంది. ఓ హీరోకు సంబందించిన కుటుంబ సభ్యులు వస్తూనే ఉంటారు. అలా సపోర్ట్ తో వచ్చినా కానీ ఆ హీరోకంటూ ఓ హిట్ పడితేనే ప్రేక్షకులలో రిజిస్టర్ అవుతాడు. ఆ హీరోలకు బ్యాక్ గ్రౌండ్ లో ఎంత సపోర్ట్ ఉన్నా సరే.. కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించాడా లేదా అనేదే అసలు పాయింట్.

  • Published Aug 08, 2025 | 4:52 PMUpdated Aug 08, 2025 | 4:52 PM
సుధీర్ బాబు ప్లాన్ ఈసారైనా ఫలిస్తుందా !

ఇండస్ట్రీలో వారసత్వం కొనసాగుతూనే ఉంటుంది. ఓ హీరోకు సంబందించిన కుటుంబ సభ్యులు వస్తూనే ఉంటారు. అలా సపోర్ట్ తో వచ్చినా కానీ ఆ హీరోకంటూ ఓ హిట్ పడితేనే ప్రేక్షకులలో రిజిస్టర్ అవుతాడు. ఆ హీరోలకు బ్యాక్ గ్రౌండ్ లో ఎంత సపోర్ట్ ఉన్నా సరే.. కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించాడా లేదా అనేదే అసలు పాయింట్. అలా కృష్ణ అల్లుడిగా మహేష్ బావగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి హీరోగా పరవాలేదు అనిపించుకున్నాడు. కొన్ని ఫ్లాపులు పడిన మాట నిజమే కానీ ఈ మధ్య మంచి సినిమాలు చేస్తున్నా.. అతను కోరుకునే కమర్షియల్ సక్సెస్ మాత్రం రావట్లేదు.

సో ఈసారి సుధీర్ బాబు కాస్త తన స్టైల్ ని మార్చాడు. ట్రెండ్ కు తగిన కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అదే జటాధర. వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైశ్వాల్ అనే ఇద్దరు దర్శకులు ఈ సినిమాను తీస్తున్నారు. తాజాగా మూవీ నుంచి ఫస్ట్ టీజర్ ను రిలీజ్ చేశారు. సుధీర్ బాబు గత చిత్రాలకు సంబంధం లేకుండా ఈ సినిమాకు భారీ బడ్జెట్ ను కేటాయిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు రిలీజ్ చేసిన టీజర్ మాత్రం సినిమాపై అంచనాలను పెంచే విధంగానే కనిపిస్తుంది.

ఈ టీజర్ విషయానికొస్తే… ప్రస్తుతం డివోషనల్ ఎలిమెంట్స్ ను సినిమాలో యాడ్ చేస్తే అది సూపర్ హిట్ అవుతుంది. దేవుడు , దుష్ట శక్తి మధ్య పోరు తరతరాల నుంచి వస్తూనే ఉంది. తాజాగా మహావతారా నరసింహ సినిమా విషయంలో ఏమి జరిగిందో తెలియనిది కాదు. ఇప్పుడు ఇదే ట్రెండ్ లో ‘జటాధర’ లాంటి దైవ కృప ఉన్న కుర్రాడికి… దుష్ట శక్తి ఆవహించిన అమ్మాయికి మధ్య జరిగే పోరును ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది. భారీ విఎఫ్ఎక్స్ కూడా ఈ కాన్సెప్ట్ కు యాడ్ అయితే సినిమా సక్సెస్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు.