iDreamPost
android-app
ios-app

OTT లకు ట్విస్ట్ ఇచ్చిన మహావతార్ నరసింహ

  • Published Aug 07, 2025 | 3:54 PM Updated Updated Aug 07, 2025 | 3:54 PM

ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్స్ అన్ని ఓటిటి లే డిసైడ్ చేస్తున్నాయని.. రిలీజ్ కు ముందే ఓటిటి డీల్ క్లోజ్ చేయడంతో ఇలాంటి పరిస్థితిలు ఏర్పడుతున్నాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తూనే ఉంది. ఈ ఏడాది అయితే ఒకటి రెండు కాదు చాలా వరకు సినిమాలేమి చెప్పిన సమయానికి రిలీజ్ అవ్వలేదు. దీనికి సంబందించిన వివాదాలు కూడా వార్తల్లోకి వచ్చిన రోజులు ఉన్నాయి.

ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్స్ అన్ని ఓటిటి లే డిసైడ్ చేస్తున్నాయని.. రిలీజ్ కు ముందే ఓటిటి డీల్ క్లోజ్ చేయడంతో ఇలాంటి పరిస్థితిలు ఏర్పడుతున్నాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తూనే ఉంది. ఈ ఏడాది అయితే ఒకటి రెండు కాదు చాలా వరకు సినిమాలేమి చెప్పిన సమయానికి రిలీజ్ అవ్వలేదు. దీనికి సంబందించిన వివాదాలు కూడా వార్తల్లోకి వచ్చిన రోజులు ఉన్నాయి.

  • Published Aug 07, 2025 | 3:54 PMUpdated Aug 07, 2025 | 3:54 PM
OTT లకు ట్విస్ట్ ఇచ్చిన మహావతార్ నరసింహ

ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్స్ అన్ని ఓటిటి లే డిసైడ్ చేస్తున్నాయని.. రిలీజ్ కు ముందే ఓటిటి డీల్ క్లోజ్ చేయడంతో ఇలాంటి పరిస్థితిలు ఏర్పడుతున్నాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తూనే ఉంది. ఈ ఏడాది అయితే ఒకటి రెండు కాదు చాలా వరకు సినిమాలేమి చెప్పిన సమయానికి రిలీజ్ అవ్వలేదు. దీనికి సంబందించిన వివాదాలు కూడా వార్తల్లోకి వచ్చిన రోజులు ఉన్నాయి. సో చాలా మంది నిర్మాతలు ఓటిటి డీల్స్ వలన రాజీపడక తప్పలేదు. కానీ ఇప్పుడు ఈ యానిమేషన్ మూవీ మాత్రం ఓటిటి లకె ట్విస్ట్ ఇచ్చింది.

ఓ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయంటే.. ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ ముందే కర్చీఫ్ వేసుకోవడం ఇప్పుడు ఆనవాయితీ అయిపోయింది. కానీ మహావతార్ నరసింహకు మాత్రం రిలీజ్ కు ముందు ఓటిటి డీల్ జరగలేదు. మినిమమ్ అంచనాలతో ఎంట్రీ ఇచ్చిన ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా..పది రోజులోనే వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. జెట్ స్పీడ్ లో షోస్ బుక్ అవుతున్నాయి. దీనితో ఇప్పుడు ఓటిటి సంస్థలు డిజిటల్ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి. దీనిలో జియో హాట్ స్టార్ ముందు ఉందని.. ఓ నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ కు రావొచ్చని కథనాలు వినిపిస్తున్నాయి.

కానీ మహావతార్ టీం మాత్రం ఈ కథనాలకు బ్రేక్ వేసింది. ప్రస్తుతం సినిమా సక్సెసఫుల్ గా థియేటర్స్ లో రన్ అవుతుంది కాబట్టి.. ఇప్పట్లో ఓటిటి లోకి వచ్చే ప్రసక్తి లేదని చెప్పేసింది. అలాగే ఇప్పటివరకు వారు ఏ ఓటిటి ప్లాట్ ఫార్మ్ ను కన్ఫర్మ్ చేయలేదని చెప్పింది. సో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ఇంకా అమ్ముడుపోలేదన్నమాట. థియేట్రికల్ రన్ ను బట్టి డిజిటల్ రైట్స్ విషయంలో నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.