Swetha
రోజు రోజుకి సోషల్ మీడియా స్పీడ్ గా దూసుకుపోతున్న తరుణంలో.. గాసిప్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. అందులోను సినీ నటీ నటుల గురించైతే మరీను. ఎప్పుడు ఎవరు ఎవరితో కలిసి కనిపిస్తారా అని కాచుకుని కూర్చుంటారో ఏమో తెలియదు కానీ.. అసలు ఏ సంబంధం లేని హీరో హీరోయిన్ తరుచు కలుస్తూ కనిపించారంటే.
రోజు రోజుకి సోషల్ మీడియా స్పీడ్ గా దూసుకుపోతున్న తరుణంలో.. గాసిప్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. అందులోను సినీ నటీ నటుల గురించైతే మరీను. ఎప్పుడు ఎవరు ఎవరితో కలిసి కనిపిస్తారా అని కాచుకుని కూర్చుంటారో ఏమో తెలియదు కానీ.. అసలు ఏ సంబంధం లేని హీరో హీరోయిన్ తరుచు కలుస్తూ కనిపించారంటే.
Swetha
రోజు రోజుకి సోషల్ మీడియా స్పీడ్ గా దూసుకుపోతున్న తరుణంలో.. గాసిప్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి. అందులోను సినీ నటీ నటుల గురించైతే మరీను. ఎప్పుడు ఎవరు ఎవరితో కలిసి కనిపిస్తారా అని కాచుకుని కూర్చుంటారో ఏమో తెలియదు కానీ.. అసలు ఏ సంబంధం లేని హీరో హీరోయిన్ తరుచు కలుస్తూ కనిపించారంటే. ఇక వారి గురించి సోషల్ మీడియా కోడై కూయాల్సిందే. ఇప్పుడు తమిళ నటుడు ధనుష్ , బాలీవుడ్ అమ్మడు మృణాల్ గురించి ఇలాంటి ప్రచారమే జరుగుతుంది. ధనుష్ కు తన మ్యారిటల్ లైఫ్ లో విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇంకా వారికి విడాకులు వచ్చాయో లేదో అధికారిక ప్రకటన అయితే లేదు. కానీ చాలా కాలంగా ఇద్దరు విడివిడిగానే ఉంటున్నారు. ఇక మృణాల్ విషయానికొస్తే ఈ అమ్మడు ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఈ ఇద్దరు కలిసి ఇప్పటివరకు ఏ సినిమా కూడా చేసింది లేదు. కానీ ఈ ఇద్దరు ఈ మధ్యన తరచూ కలిసి కనిపిస్తున్నారు. సో వీరి మధ్య రిలేషన్ మొదలైందంటూ నెట్టింట కాస్త గట్టిగానే మాటలు వినిపిస్తున్నాయి. తాజాగా మృణాల్ నటించిన సన్నాఫ్ సర్దార్-2 సినిమా ప్రీమియర్ ను ముంబైలో వేశారు. దానికి ధనుష్ అటెండ్ అవ్వడంతో సందేహాలు ఇంకా బలమయ్యాయి.
పైగా ఇరు కుటుంబ సభ్యులు ఈ మధ్య కలుసుకున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వార్తలు వినిపించడమే కానీ ఇంతవరకు అటు ధనుష్ కానీ ఇటు మృణాల్ కానీ ఇంతవరకు దీనిమీద స్పందించలేదు.వీరు నోరు విప్పితే తప్ప అసలు మ్యాటర్ ఏంటి అనేది తెలియదు. అప్పటివరకు ఎవరికి నచ్చిన కథలు వారు అల్లుతునే ఉంటారు. ఏది ఎంతవరకు నిజం అనేది అసలైన వారే చెప్పాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.