iDreamPost
android-app
ios-app

వార్ 2 జాగ్రత్తా లేదా అతి జాగ్రత్తా !

  • Published Aug 06, 2025 | 4:55 PM Updated Updated Aug 06, 2025 | 4:55 PM

సినిమా రిలీజ్ కు పట్టుమని పది రోజులు కూడా లేదు. కానీ సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రం అసలు ఎక్కడ సౌండ్ లేదు. ఈ మధ్య ట్రైలర్ రిలీజ్ చేశారు కానీ అది కూడా ప్రేక్షకులను వాళ్ళు అనుకున్న రేంజ్ లో మెప్పించలేకపోయింది. మరోవైపు ఈ సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న కూలి ప్రమోషన్స్ అప్డేట్స్ అంటూ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది.

సినిమా రిలీజ్ కు పట్టుమని పది రోజులు కూడా లేదు. కానీ సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రం అసలు ఎక్కడ సౌండ్ లేదు. ఈ మధ్య ట్రైలర్ రిలీజ్ చేశారు కానీ అది కూడా ప్రేక్షకులను వాళ్ళు అనుకున్న రేంజ్ లో మెప్పించలేకపోయింది. మరోవైపు ఈ సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న కూలి ప్రమోషన్స్ అప్డేట్స్ అంటూ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది.

  • Published Aug 06, 2025 | 4:55 PMUpdated Aug 06, 2025 | 4:55 PM
వార్ 2 జాగ్రత్తా లేదా అతి జాగ్రత్తా !

సినిమా రిలీజ్ కు పట్టుమని పది రోజులు కూడా లేదు. కానీ సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రం అసలు ఎక్కడ సౌండ్ లేదు. ఈ మధ్య ట్రైలర్ రిలీజ్ చేశారు కానీ అది కూడా ప్రేక్షకులను వాళ్ళు అనుకున్న రేంజ్ లో మెప్పించలేకపోయింది. మరోవైపు ఈ సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న కూలి ప్రమోషన్స్ అప్డేట్స్ అంటూ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ప్రేక్షకులను బ్యాక్ టు బ్యాక్ మూవీ అప్డేట్స్ తో ఎంగేజ్ చేస్తుంది. దీనితో తారక్ అభిమానులంతా వార్ 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అసలు వార్ 2 మేకర్స్ ఏమైంది జాగ్రత్త పడుతున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటిదాకా సినిమా నుంచి కేవలం ఒకే ఒక్క పాట బయటకు వచ్చింది. అది కూడా హృతిక్ రోషన్ , కియారా అద్వానీల జవాన్ సాంగ్. అలాగే రీసెంట్ గా మేకింగ్ వీడియో ను కూడా రిలీజ్ చేశారు. అసలు సినిమాకు ఇక్కడ హైప్ పెరుగుతుంది తారక్ ఉండడం వలన. సో దానిని క్యాష్ చేసుకోవాలి అంటే తారక్ కు సంబందించిన గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేయాలి. దానికి సంబందించిన వీడియోను రిలీజ్ అయితే చేస్తున్నారు కానీ అది ఫుల్ సాంగ్ కాదు. సో ఇలా ఎలా చూసినా వార్ 2 పబ్లిసిటీ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది.

ఇప్పుడు కూలి సినిమా కాంపిటీషన్ కు కనుక లేకపోతే అంతా సైలెంట్ గా ఉండేవారేమో. కానీ ఓ పక్క భారీ సినిమాను కాంపిటీటర్ గా ఉంచుకుని కూడా వార్ 2 మేకర్స్ సైలెంట్ గా ఉండడంతో.. ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ గా మారింది. సో ఇప్పటికైనా వార్ 2 మేకర్స్ బయటకు వచ్చి ఇంటర్వూస్ , ఈవెంట్స్ చేస్తే.. ఫ్యాన్స్ కాస్త ఖుషి అవుతారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.