iDreamPost
android-app
ios-app

సెప్టెంబర్ 5 న పోటీ గట్టిగానే ఉందిగా !

  • Published Aug 08, 2025 | 10:34 AM Updated Updated Aug 08, 2025 | 10:34 AM

సెప్టెంబర్ 25న ఓజి, అఖండ2 రావడంతో టాలీవుడ్ లో ఆరోజు అతి పెద్ద క్లాష్ ఉండబోతుందని అంతా అనుకున్నారు. ఓజి రావడం అయితే కన్ఫర్మ్ అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక అఖండ 2 సంగతి మాత్రం సస్పెన్స్. సరే ఈ రెండు ఎలా ఉన్నా సరే అసలు ఫైట్ సెప్టెంబర్ 25 కంటే ముందే ఉండనుంది. అదే సెప్టెంబర్ 5. ఎందుకంటే ఆరోజున ఏకంగా ఐదు ప్యాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కానున్నాయి.

సెప్టెంబర్ 25న ఓజి, అఖండ2 రావడంతో టాలీవుడ్ లో ఆరోజు అతి పెద్ద క్లాష్ ఉండబోతుందని అంతా అనుకున్నారు. ఓజి రావడం అయితే కన్ఫర్మ్ అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక అఖండ 2 సంగతి మాత్రం సస్పెన్స్. సరే ఈ రెండు ఎలా ఉన్నా సరే అసలు ఫైట్ సెప్టెంబర్ 25 కంటే ముందే ఉండనుంది. అదే సెప్టెంబర్ 5. ఎందుకంటే ఆరోజున ఏకంగా ఐదు ప్యాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కానున్నాయి.

  • Published Aug 08, 2025 | 10:34 AMUpdated Aug 08, 2025 | 10:34 AM
సెప్టెంబర్ 5 న పోటీ గట్టిగానే ఉందిగా !

సెప్టెంబర్ 25న ఓజి, అఖండ2 రావడంతో టాలీవుడ్ లో ఆరోజు అతి పెద్ద క్లాష్ ఉండబోతుందని అంతా అనుకున్నారు. ఓజి రావడం అయితే కన్ఫర్మ్ అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక అఖండ 2 సంగతి మాత్రం సస్పెన్స్. సరే ఈ రెండు ఎలా ఉన్నా సరే అసలు ఫైట్ సెప్టెంబర్ 25 కంటే ముందే ఉండనుంది. అదే సెప్టెంబర్ 5. ఎందుకంటే ఆరోజున ఏకంగా ఐదు ప్యాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కానున్నాయి. తేజ సజ్జా మిరాయ్ మూవీ ఈ డేట్ ను ఎప్పుడూ లాక్ చేసుకుంది. ఈ రిలీజ్ డేట్ లో ఎలాంటి ఛేంజ్ లేదని ప్రొడ్యూసర్ టిజి విశ్వప్రసాద్ రీసెంట్ గా కన్ఫర్మ్ చేసేశారు. సో ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ అసలు లేదు. ఆల్రెడీ సినిమా మీద అంచనాలు బాగానే ఉన్నాయి.

ఇక రీసెంట్ గా స్వీటీ ఘాటీ మూవీ కూడా సేమ్ డేట్ ను లాక్ చేసుకుంది. అనుష్కను తెరమీద చూసి చాలా కాలమే అయింది కాబట్టి ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందులోను మొన్న రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. అనుష్క వైలెంట్ గెటప్ ను అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆల్రెడీ పోస్ట్ పోన్ అయ్యి.. మళ్ళీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సినిమా కాబట్టి ఈ సినిమా రిలీజ్ డేట్ లో కూడా ఛేంజ్ లేదు. ఇక ఈ రెండు కాకుండా అప్పుడెప్పుడో అప్డేట్ ఇచ్చిన రష్మిక మందన ‘ది గర్ల్ ఫ్రెండ్’ కూడా సెప్టెంబర్ 5న రావడం ఖాయమేనట. దీనికి సంబందించిన అఫీషియల్ అనౌన్సమెంట్ రేపో ఎల్లుండో రావొచ్చని టాక్.

ఈ మూడు సినిమాలు కాకుండా మరో రెండు తమిళ్ సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎంట్రీ ఇవ్వనున్నాయి. శివ కార్తికేయన్ ‘మదరాసి’ సినిమా . విజయ్ ఆంటోని ‘భద్రకాళి’ సినిమా. తమిళ సినిమాల కంటెంట్ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో తెలియనిది కాదు. సో మొదటి రోజు టాక్ బావుంటే వీటికి కూడా ప్రేక్షకులు అట్ట్రాక్ట్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. ఇక సెప్టెంబర్ 5 న ప్రేక్షకుల ఛాయస్ ఏ మూవీ అవుతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.