iDreamPost
iDreamPost
సంక్రాంతి హడావిడి ముగిసిపోయింది. మూవీ లవర్స్ కొత్త సినిమాలతో పండగ చేసుకున్నారు. అల వైకుంఠపురములో, సరిలేరు నీకేవ్వరు వాళ్ళ ఆకలిని తీర్చగా మరీ డై హార్డ్ ఫ్యాన్స్ అయిన వాళ్ళు రజని, కళ్యాణ్ రామ్ సినిమాలతో కూడా పండగ చేసుకున్నారు . ఇప్పుడీ అధ్యాయం ముగిసింది. బన్నీ, మహేష్ ల చిత్రాలు ఫైనల్ రన్ కు ఇంకా రానప్పటికీ ఎంతో కొంత డ్రాప్ ఉన్న మాట వాస్తవం.
ఇదలా ఉంచితే ఈ శుక్రవారం రవితేజ డిస్కో రాజా బాక్స్ ఆఫీస్ ని సోలోగా పలకరించబోతోంది. వేరే ఏ తెలుగు స్ట్రెయిట్ మూవీ పోటీలో లేదు. మంచి నెంబర్ తో ఎక్కువ స్క్రీన్లలో రిలీజయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటిదాకా వదిలిన టీజర్లు, పాటలు డిస్కో రాజా మీద హైప్ ని పెంచేసాయి. వాటిని నిలబెట్టుకుంటే మాత్రం మంచి కలెక్షన్లు సాధించే అవకాశం స్పష్టంగా ఉంది. అసలే గత ఏడాది రవితేజ సినిమా ఒక్కటీ విడుదల కాలేదు. అంతకుముందు సంవత్సరం ఒకటి కాదు ఏకంగా మూడు డిజాస్టర్లు పడ్డాయి. టచ్ చేసి చూడు, నేల టికెట్టు, అమర్ అక్బర్ అంటోనీ ఒకదాన్ని మించి మరొకటి బయ్యర్లకు పీడకలలు మిగిల్చాయి.
ఇప్పుడు డిస్కో రాజా బ్లాక్ బస్టర్ అయితేనే రవితేజకు మార్కెట్ మళ్ళి జీవం పోసుకుంటుంది. హిట్ టాక్ వస్తే మాత్రం లక్కీనే. ఎందుకంటే దగ్గరలో భారీ పోటీ ఏమి లేదు. 31న నాగశౌర్య అశ్వద్ధామ ఉంది కాని మరీ టెన్షన్ పడే కాంపిటీషన్ కాదు. కాబట్టి సరిగ్గా వాడుకుంటే మాస్ మహారాజాకు ఇంతకు మించిన తరుణం రాదు. వీకెండ్ లో రిపబ్లిక్ డే ఆదివారం రావడం ఒక రోజు కలెక్షన్లు తగ్గించినా టాక్ గట్టిగా నిలబడితే అదేమీ సమస్యే కాదు. నభ నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరొయిన్లు నటించిన డిస్కో రాజాకు విఐ ఆనంద్ దర్శకుడు.