iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ ప్రముఖ నటుడు ఈశ్వరరావు కన్నుమూత

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత నెలలో నిర్మాత దిల్ రాజు, నటుడు నాజర్ తండ్రి కన్నుమూశారు. అటు మలయాళ పరిశ్రమలో టీవీ, సినీ నటి రెంజుషా, డా. ప్రియ మరణించారు. ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ నటుడు తుది శ్వాస విడిచారు.

సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత నెలలో నిర్మాత దిల్ రాజు, నటుడు నాజర్ తండ్రి కన్నుమూశారు. అటు మలయాళ పరిశ్రమలో టీవీ, సినీ నటి రెంజుషా, డా. ప్రియ మరణించారు. ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ నటుడు తుది శ్వాస విడిచారు.

టాలీవుడ్ ప్రముఖ నటుడు ఈశ్వరరావు కన్నుమూత

సినీ పరిశ్రమను విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తండ్రి మరణ వార్త మరువక ముందే.. టాలీవుడ్, కోలీవుడ్ విలక్షణ నటుడు నాజర్ తండ్రి కన్నుమూసిన సంగతి విదితమే. మాలీవుడ్‌లో కూడా వరుసగా మరణాలు చోటుచేకున్నాయి. ప్రముఖ టీవీ, సినీ నటి రెంజుషా మీనన్ ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. మరో టీవీ నటి డాక్టర్ ప్రియ గుండె పోటుతో మరణించింది. గర్భిణి అయిన ఆమె జనరల్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లి గుండెపోటుకు గురైంది. వెంటనే ఆమెకు ఆపరేషన్ చేసి బిడ్డను బతికించగలిగారు వైద్యులు. నిన్నటికి నిన్న కోలీవుడ్ ప్రముఖ నటుడు టీఎస్ బాలయ్య తనయుడు జూనియర్ బాలయ్య తుది శ్వాస విడిచారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు ఇక లేరన్న వార్త వినిపించింది.

ప్రముఖ నటుడు ఈశ్వర రావు కన్నుమూశారు. ఆయన తెలుగులో చాలా సినిమాల్లో నటించారు. అన్నయ్య, కొడుకు, స్నేహితుడు, విలన్ వంటి సపోర్టింగ్ క్యారెక్టర్లను చేశారు. గత నెల 31న మరణించినట్లు సమాచారం. అయితే ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. మిచిగాన్‌లోని కుమార్తె ఇంటిని వెళ్లిన ఆయన అక్కడే కన్నుమూశారని తెలుస్తోంది. దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించిన స్వర్గం, నరకం ఆయనకు మొదటి సినిమా. ఇదే సినిమాతోనే మోహన్ బాబు కూడా పరిశ్రమలోకి వచ్చారు. దేవతలారా దీవించండి, కన్నవారిల్లు, ఖైదీ నెం 77, యుగపురుషుడు, శభాష్ గోపి, ఆడదంటే అలుసా, తల్లిదీవెన, ప్రేమాభిషేకం, బంగారు బాట, సంగీత, ఘరానా మొగుడు వంటి చిత్రాల్లో కనిపించారు. ఆయన దాదాపు 250 వంటి చిత్రాల్లో నటించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి