iDreamPost
android-app
ios-app

అక్కినేనితో చిన్నారి సుప్రియం – Nostalgia

  • Published Apr 13, 2020 | 8:52 AM Updated Updated Apr 13, 2020 | 8:52 AM
  • Published Apr 13, 2020 | 8:52 AMUpdated Apr 13, 2020 | 8:52 AM
అక్కినేనితో చిన్నారి సుప్రియం – Nostalgia

ఇక్కడ ఫోటోలోని అక్కినేని నాగేశ్వర్ రావు గారి పక్కన కూర్చున్న పాపను గుర్తు పట్టారా. హీరో సుమంత్ సోదరి సుప్రియ అనడం కన్నా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ఒకేసారి డెబ్యూ చేసిన హీరోయిన్ అంటే వెంటనే ఫ్లాష్ అవుతుంది. అవును ఇక్కడ ఉన్నది సుప్రియనే. ఆ మధ్య అడవి శేష్ గూఢచారి సినిమాలో కీలక పాత్ర చేసి మెప్పించింది ఈమే. ఇక ఫోటో విషయానికి వస్తే ఇది 1981లో తీసిన పిక్. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో అక్కినేని హీరోగా రూపొందిన ప్రేమ మందిరం షూటింగ్ గ్యాప్ లో క్లిక్ మనిపించింది.

ఆ టైంలోనే బ్లాక్ బస్టర్ హిట్ అయిన శ్రీవారి ముచ్చట్లు, అదే సంవత్సరం రిలీజై చరిత్ర సృష్టించిన ప్రేమాభిషేకం కాంబినేషన్ కావడంతో అప్పట్లో దీని మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. జయప్రద, అంబికా హీరోయిన్లుగా నటించారు. దీనికి నిర్మాత రామానాయుడు గారు. మొదటిసారి దాసరితో తమ బ్యానర్ లో ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. దేవదాసి వ్యవస్థకు ప్రేమ కథను ముడిపెట్టిన తీరు ఎందుకో ప్రేక్షకుల మెప్పు పొందలేకపోయింది. ఇందులో ఏఎన్ఆర్ డ్యూయల్ రోల్ చేయడం విశేషం. తండ్రి కొడుకులుగా డిఫెరెంట్ షేడ్స్ లో కనిపిస్తారు.

ఆ సందర్భంలో తీసుకున్న ఈ పిక్ చక్కని జ్ఞాపకంగా చెప్పుకోవచ్చు. మహదేవన్ పాటలు మెప్పు పొందినా ప్రేమ మందిరం ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. తర్వాత రామానాయుడు అక్కినేనితో గురుబ్రహ్మ అనే మరో సినిమా తీశారు కానీ అది పర్వాలేదు అనిపించుకుంది. ఇక సుప్రియ విషయానికి వస్తే మొదటి సినిమా పవర్ స్టార్ తో చేసి అది హిట్ అయినప్పటికీ తర్వాత హీరోయిన్ గా కొనసాగేందుకు ఇష్టపడలేదు. వ్యాపార మెళుకువలు పుష్కలంగా ఉండే సుప్రియ ప్రస్తుతం అక్కినేని సంస్థలకు చెందిన వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. గూఢచారి పేరు తెచ్చినప్పటికీ కొత్తగా ఆఫర్లేమీ ఒప్పుకోలేదు. తాతయ్యతో ఇలాంటి జ్ఞాపకాలెన్నో సుప్రియతో పాటు సుమంతుకూ ఉన్నాయి.

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet