iDreamPost
iDreamPost
ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లాంటి విజువల్ గ్రాండియర్ పాన్ ఇండియా సినిమాల మధ్య పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ వస్తుందా రాదా అనే అనుమానాలకు చెక్ పడిపోయింది. జనవరి 12 థియేటర్లలో రావడం ఖాయమని నిర్మాతలు మరోసారి స్పష్టం చేశారు. ఇవాళ సాయంత్రం భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ వీడియో ప్రోమో విడుదల చేస్తున్న సందర్భంగా వదిలిన కొత్త పోస్టర్ లో మరోసారి డేట్ కన్ఫర్మ్ చేయడం ద్వారా పవన్ ఫ్యాన్స్ టెన్షన్ కు బ్రేక్ వేశారు. అయితే ఆందోళన పూర్తిగా తొలగిపోలేదు. ఎందుకంటే పై రెండు సినిమాలతో పోటీ అంత ఈజీ కాదు. థియేటర్లను పంచుకోవడంతో పాటు వసూళ్లకు సంబంధించిన లెక్కల వాటాలను కొంత త్యాగం చేయాల్సి ఉంటుంది.
ఇదంతా ఏ సినిమా బాగుంది ఏది యావరేజ్ గా ఉందనే దాని మీద ఆధార పడి ఉంటుంది. అసలే భీమ్లా నాయక్ అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్. ఉండబట్టలేక అమెజాన్ ప్రైమ్ లో మలయాళం వెర్షన్ చూసినవాళ్లు చాలానే ఉన్నారు. పవన్ రానాల కాంబినేషన్ ఆసక్తి రేపేదే అయినప్పటికీ ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లో ఉండే గ్రాండియర్, గ్రాఫిక్స్ ఇందులో ఉండవు.స్టార్ పవర్ పక్కన పెడితే బడ్జెట్ లెక్కల్లో చూస్తే పోలికలోకి కూడా రాదు. వకీల్ సాబ్ ఎలాంటి కాంపిటీషన్ లేకపోయినా 90 కోట్లను దాటి వెళ్లలేకపోయింది. మరి భీమ్లా నాయక్ ఇంత తీవ్రమైన పోటీలో వంద కోట్ల మార్కు దాటడం అంత సులభం కాదు. కొంతమేర సాహసమే అని చెప్పాలి.
టైటిల్ సాంగ్ గురించి తమన్ గట్టిగానే ఊరిస్తున్నాడు. దానికి తగ్గట్టే ఇవాళ వచ్చిన పోస్టర్ లో కింద కూర్చున్న పవన్ మాస్ లుక్ మాములుగా లేదు. ప్రోమో స్టిల్స్, పాటలు చూస్తుంటే చాలా మార్పులు జరిగినట్టు కనిపిస్తోంది. ఒరిజినల్ లో లేని డ్యూయెట్లు, ఫైట్లు, మాస్ గెటప్ లు ఇందులో వచ్చి చేరాయి. త్రివిక్రమ్ రచన ఏ మేరకు దీన్ని హై లెవెల్ కు తీసుకెళ్తుందో చూడాలి. భీమ్లా నాయక్ తర్వాత పవన్ చేస్తున్న హరిహర వీరమల్లు సమ్మర్ లో విడుదల చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది. ఒకవేళ షూటింగ్ ఆలస్యమైతే దసరా లేదా దీపావళికి షిఫ్ట్ చేశారు. ఏది ఎలా ఉన్నా 2022లో పవన్ రెండు సినిమాలు విడుదల కావడం మాత్రం కన్ఫర్మ్
Also Read : Sooryavanshi : మల్టీ స్టారర్ విడుదలకు అనుకోని ఇబ్బంది