iDreamPost
iDreamPost
ఈ రోజు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో 67వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం కన్నులపండుగలా జరిగింది. ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం సూపర్ స్టార్ రజినీకాంత్ ను వరించగా ఆయన అల్లుడు ధనుష్ అసురన్ కు గాను ఉత్తమ నటుడి అవార్డు అందుకోవడం అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఇలా ఒకే ఏడాదిలో మామా అల్లుళ్ళు నేషనల్ అవార్డు దక్కించుకోవడం అరుదైన ఘనతగా చెప్పుకుంటున్నారు. ఇక తెలుగు విషయానికి వస్తే ఉత్తమ చిత్రం, ఎడిటింగ్ విభాగాల్లో జెర్సీకి గౌరవడం దక్కగా ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహర్షి అవార్డు చేజిక్కించుకోవడం మహేష్ ఫాన్స్ ని సంతోషంలో ముంచెత్తింది.
ఇంకా థియేటర్లలో విడుదలే కానీ మోహన్ లాల్ మరక్కర్ కు బెస్ట్ ఫిలిం అవార్డు రావడం విశేషం. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ విజువల్ గ్రాండియర్ కేరళలో పరిస్థితి పూర్తిగా చక్కబడ్డాక ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ధనుష్ తో పాటు భోంస్లేకు గాను మనోజ్ బాజ్ పాయ్ బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్నారు. మణికర్ణికలో పెర్ఫార్మన్స్ కు కంగనా రౌనత్, బహత్తర్ హురేన్ సినిమాలో టేకింగ్ కు గాను దర్శకుడు సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్ లు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఉత్తమ హిందీ తమిళ చిత్రాలుగా చిచోరే,అసురన్ లు అగ్ర స్థానంలో నిలిచాయి. యాక్షన్ కొరియోగ్రఫీ విభాగంలో కన్నడ మూవీ అవనే శ్రీమన్నారాయణ, ఉత్తమ సంగీత దర్శకుడిగా విశ్వాసం సినిమాకు ఇమ్మాన్ కు దక్కింది.
గతంతో పోల్చుకుంటే జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాకు తగినంత గౌరవం దక్కుతోంది. ఇంకా సరైన రీతిలో సినిమాలను ఎంపిక చేయడం లేదనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రియదర్శి మల్లేశంని అసలు పరిగణనలోకే తీసుకోకపోవడం విమర్శకులను సైతం ఆశ్చర్యపరిచింది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయకు సముచిత స్థానం దక్కలేదు. కుల వివక్షను పాయింట్ గా తీసుకుని పగలు ప్రతీకారాలుతో నిండిపోయిన అసురన్ కు మాత్రం గుర్తింపు ఎలా వచ్చిందనే విమర్శలు లేకపోలేదు. అయినా గత కొన్నేళ్లుగా అవార్డుల విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారిపోయిన తరుణంలో రాబోయే రోజుల్లో ఇది మొక్కుబడి ప్రహసనంగా మారుతుందేమో
Also Read : Romantic : కొడుకు సినిమా కోసం పూరి రిస్కీ ప్రమోషన్లు