Romantic : కొడుకు సినిమా కోసం పూరి రిస్కీ ప్రమోషన్లు

By iDream Post Oct. 25, 2021, 04:30 pm IST
Romantic : కొడుకు సినిమా కోసం పూరి రిస్కీ ప్రమోషన్లు

ఈ నెల 29న విడుదల కాబోతున్న ఆకాష్ పూరి రొమాంటిక్ మీద మెల్లగా అంచనాలు మొదలయ్యాయి. దీన్ని ఎలాగైనా క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో టీమ్ కూడా ప్రమోషన్ల వేగం పెంచింది. ట్రైలర్ కట్ యూత్ ని ఆకట్టుకోగా తాజాగా రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేయాలని పూరి నిర్ణయించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అనిల్ పాదూరి దర్శకత్వం వహించిన ఈ లవ్ కం యాక్షన్ ఎంటర్ టైనర్ ని ఎడిటింగ్ రూమ్ లో చూసి పూరి కన్నీళ్లు పెట్టుకున్నాడన్న దర్శకుడి మాట ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమ్మానాన్నా తమిళమ్మాయి కన్నా ఎక్కువ ఎమోషన్లు ఇందులో ఉంటాయని చెప్పడం చూస్తుంటే మ్యాటర్ ఏదో గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తోంది.

నిజానికి రొమాంటిక్ నిర్మాణంలో విపరీతమైన జాప్యం జరిగింది. బడ్జెట్ సినిమాకు ఎందుకింత ఆలస్యం అనే ప్రశ్నకు అప్పట్లో రకరకాల కామెంట్లు వినిపించాయి. ఒకదశలో ఓటిటిలో వస్తుందేమో అనుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు సీన్ మారిపోయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తర్వాత బాక్సాఫీస్ వద్ద ఏర్పడ్డ వ్యాక్యూమ్ ని నింపేందుకు పూరి టీమ్ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. మీడియాకు సైతం ఒక స్పెషల్ ప్రీమియర్ వేస్తారట. త్వరగా రివ్యూలు టాకులు బయటికి వస్తాయని తెలిసి కూడా ఇంత సాహసం చేస్తున్నారంటే అంతగా సినిమాలో ఏముందో చూడాలి. కేతిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర చేశారు.

వరుడు కావలెను లాంటి ఫ్యామిలీ మూవీతో పోటీ పడుతున్న రొమాంటిక్ కు మొదటి వారం చాలా కీలకం. ఎందుకంటే దీపావళికి రజినీకాంత్ పెద్దన్న, మారుతీ మంచి రోజులు వచ్చాయితో పాటు అక్షయ్ కుమార్ సూర్యవంశీ బరిలో దిగుతున్నాయి. చాలా స్క్రీన్లు వీటికి కేటాయించే అవకాశం ఉండటంతో ఫస్ట్ వీక్ లో సాధ్యమైనంత మేరకు రాబట్టుకోవడం ఎంతో అవసరం. అందుకే పూరి టీమ్ ఇంతగా వర్క్ చేస్తున్నారు. మెహబూబా డిజాస్టర్ తర్వాత ఆకాష్ పూరి చేసిన సినిమా ఇదే. దీంతో హిట్టు పడితే కెరీర్ ఊపందుకుంటుందనే అంచనాలో పూరి ఉన్నాడు. మరి రొమాంటిక్ ఆయన ఆశలను నిలబడుతుందా లేదా చూడాలి మరి

Also Read : Bheemla Nayak & SVP : మహేష్ పవన్ సినిమాల కొత్త డేట్లు

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp