చాయ్ వాలా, కండక్టర్ కూడా రాజకీయాలలో రాణించవచ్చు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్న తర్వాత మరొకసారి రాజకీయాలలో రజనీ పాత్ర పై చర్చలు జరుగుతున్నాయి..
కధలోకి వెళితే ..1996 తమిళనాడు శాసనసభ ఎన్నికలు రాబోతున్నాయి.తమిళనాడు లో కాంగ్రెస్ లోకి రజనీకాంత్ ని తీసుకొస్తొన్నాను అని అప్పటి తమిళ ప్రదేశ్ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు మూపనార్ , ప్రధానమంత్రి పివి నరసింహారావు వద్ద ఒక ప్రతిపాదన చేశారు.ఆ ప్రతిపాదనను అంగీకరించినట్లే అనుకోని రజనీ-పివి ల సమావేశం జరిగింది.ఆ సమావేశ అనంతరం మూపనార్ ను పిలచిన పివి-“నాకెందుకో రజనీ కాంగ్రెస్ తో వస్తాడనిపించడం లేదు.మీరెటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండండి.అవసరమైతే మరొకసారి మనం అన్నాడిఎమ్ కె తోనే ఎన్నికలకు పోవాల్సి రావొచ్చు “ అని అన్నారు.ఎది పట్టించుకోని మూపనార్ మద్రాసు వచ్చి ,ఇంకెక్కడి జయలలిత మనం విజయం సాధించబోతున్నాం,అని పురచ్చితలైవి జయలలిత ను తూలనాడారు.
ఇది జరిగిన మరుసటి రోజు రజనీ మద్రాసు విమానాశ్రయంలో తనను కలసిన విలేకరులకు మీరు పివి ని కలిసార కదా అని అడిగితే , అవును ఆయన మన ప్రధాని ఆయనను ఎవరైనా కలవవచ్చు అని అన్నారు.దాంతో రజనీ ఆ ఎన్నికలకు దూరం అని అర్ధమైంది.రాజీవ్ హత్యకు కుట్రదారులకు డి.ఎమ్.కె.ఆశ్రయమిచ్చిందని ఆరోపణల నడుమ పి.వి.-డి.ఎమ్ .కె తో కలవనని ,డి.ఎమ్.కె గెలిచినా తన సిద్ధాంతం అదేనని భీష్మించుకోవడంతో అప్పటికే జయలలిత ను తిట్టిన మూపనార్ కాంగ్రెస్ ను వీడి తమిళ మానీల కాంగ్రెస్ పెట్టి డి.ఎమ్.కె తో కలసి పోటీ చేయడం డి.ఎమ్.కె గెలవడం జరిగింది.ఆ సందర్భంలో రజనీ-జయలలిత కు ఓటు వేస్తే తమిళనాడును రక్షించలేరు అని ప్రకటన చేశారు.ఆ ప్రకటన అప్పుడు గెలిపించింది అంటారు.
2012 లో హిమాలయా నదులతో అన్నీ నదులను అనుసంధానం చేయాలని ప్రజా ఉద్యమం చేశారు.
2004 లో ఇండియా ఈజ్ షైనింగ్ నినాదం జరుగుతున్న వేళ నదుల అనుసంధానం చేస్తానని బిజెపి వాగ్దానం చేసింది కాబట్టి బిజెపి-అన్నా డిఎమ్ కె కి తాను ఓటువేశానని చెప్పకనే చెప్పినా ఆ ఎన్నికలలో ఆ కూటమి ఓడిపోయింది. అలా కొన్నాళ్ళు స్తబ్దుగ ఉన్నా 2014 లో మోదీ ఎన్నికల ప్రచార వ్యూహం లో భాగంగా రజనీని కలశారు.
జయలలిత మరణం తర్వాత,2017 లో మొట్టమొదటి సారి ఫ్యాన్స్ మీట్ పెట్టారు..అనంతరం ఇదిగో పార్టీ అదిగో పార్టీ అని రాజకీయలలో పోటీ చేస్తానని,ఇప్పుడు కాదని ప్రజలను, అభిమానులను అయోమయానికి గురిచేసి 2019 లోకసభకు నేను పోటీ చేయడం లేదు అన్నారు.
ఇదిలా ఉండగా జనవరి 14 న తుగ్లక్ పత్రిక 50వ వార్షికోత్సవానికి వచ్చేసిన రజనీ మాట్లాడుతూ ద్రవిడ ఉద్యమ ఆరాధ్య నాయకుడు పెరియార్ రామస్వామి ఆనాడు జరిపిన నగ్న రామ-సీతా ఊరేగింపు సందర్భంగా చెప్పులు వేసిన కార్యకర్తల అంశాన్ని,అవమానాన్ని ధైర్యం చూపినది ఒక్క తుగ్లక్ పత్రిక మాత్రమే నని అనడంతో తమిళనాడు ద్రవిడ పార్టీలు ఉవ్వెత్తున లేచి క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టాయి..దీనిపై కేసు వెయ్యాలని చేసిన ప్రయత్నాలను మద్రాసు హైకోర్టు తప్పు పట్టింది.తాను క్షమాపణలు చెప్పనని రజనీ తెగేసి చెప్పారు.ఈ కొత్త అధ్యాయం ఏమన్నా తిరిగి రాజకీయలలో అడుగిడాలని చేసే ప్రయత్నాలేమో చూడాలి.దీంతో పాటు CAA కి మద్దతుగా మాట్లాడారు.ఎలాగో జయలలిత లేరు .ద్రవిడ అంశాన్ని అందుకుంటే ద్రవిడ పార్టీలలో భాగం అవుతానని కొత్త పల్లవి అందుకోని ఉండవచ్చు.2021 అసెంబ్లీ కి రజనీ పోటీ చేయకపోతే రజనీ రాజకీయ అధ్యాయం అభిమానులకు ఆశ మాత్రమే అవుతుంది.
చివరగా ప్రధాని అన్న మాటలు రజనీ రాజకీయ ప్రవేశానికి సూచికలేమో చూడాలి…