iDreamPost
android-app
ios-app

తెలుగువారిపై కాంట్రవర్సీ కామెంట్స్.. పరారీలో సినీ నటి కస్తూరి

  • Published Nov 11, 2024 | 10:27 AM Updated Updated Nov 11, 2024 | 10:27 AM

Actress Kasturi: నటి కస్తూరి పరారీలో ఉన్నారు. ఇటీవల తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెపై కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఆమెకు సమన్లు ఇవ్వడానికి రెడీ అయ్యారు.

Actress Kasturi: నటి కస్తూరి పరారీలో ఉన్నారు. ఇటీవల తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెపై కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఆమెకు సమన్లు ఇవ్వడానికి రెడీ అయ్యారు.

తెలుగువారిపై కాంట్రవర్సీ కామెంట్స్.. పరారీలో సినీ నటి కస్తూరి

వెనకా ముందు ఆలోచించకుండా మాట్లాడే మాటలు ఒక్కోసారి ఇబ్బందుల్లోకి నెట్టివేస్తాయి. ఇదే విధంగా సినీ నటి కస్తూరి తెలుగువారిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఆమెను చిక్కుల్లో పడేలా చేశాయి. తెలుగు ప్రజలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. తెలుగు సంఘాలు కస్తూరిపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. తెలుగు జాతిపై దిగజారుడు వ్యాఖ్యలు చేసిన కస్తూరిపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో తమిళనాడులోని తెలుగు వారు ఆమెపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కస్తురిపై చెన్నైలోని ఎగ్మూర్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ క్రమంలో పోలీసులు నటి కస్తూరికి సమన్లు ఇవ్వడానికి రెడీ అయ్యారు.

ఈ క్రమంలో చెన్నైలోని ఆమె నివాసానికి పోలీసులు వెళ్లారు. ఆ సమయంలో ఆమె ఇంటికి తాళం వేసి ఉండడంతో ఫోన్ లో సంప్రదించడానికి ప్రయత్నించారు. ఫోన్ కూడా స్విఛ్చాఫ్ రావడంతో ఆమె పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆమె ఎక్కడుందన్న విషయంపై స్పష్టత లేదు. కస్తూరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నటి కస్తూరి పరారీలో ఉండడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే.. నటి కస్తూరి రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వాళ్లని తక్కువచేసి మాట్లాడారు. అలా వచ్చిన వారంతా ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ మాట్లాడుతున్నారని వ్యాఖ్యలు చేసింది.

300 సంవత్సరాల కిందట ఒక రాజు వద్ద అంతఃపుర రాణులకు సేవ చేయడానికి వచ్చిన తెలుగు వారు.. ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే మరి శతాబ్దాలకు పూర్వమే ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి మీరెవరు..? అని ఆమె ప్రశ్నించారు. దీనిపై ఆందోళనలు వెల్లువెత్తడంతో దిగొచ్చిన కస్తూరి తెలుగు వారిని బాధపెట్టడం నా ఉద్దేశ్యం కాదని ఆమె క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఈ వివాదం కొనసాగుతుండగానే మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో బ్రాహ్మణేతరులు లంచాలు తీసుకుంటున్నారని కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలతో ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి.

కస్తూరి వ్యాఖ్యలను ముక్త కంఠంతో ఖండించాయి. నటి కస్తూరి వ్యాఖ్యలు కొన్ని వర్గాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజల్లో తప్పుడు అభిప్రాయాన్ని సృష్టిస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది తమిళనాడు రెవెన్యూ అధికారుల సంఘం. ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడిన కస్తూరిపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని రెవెన్యూ అధికారుల సంగం కోరింది. డీఎంకే నేతలు తనను టార్గెట్ చేస్తున్నారని నటి కస్తూరి ఆరోపించింది. ఈవివాదాల నేపథ్యంలో ఆమెపై కేసులు నమోదవ్వగా నటి కస్తూరి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నటి కస్తూరి పరారీలో ఉండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.