iDreamPost
android-app
ios-app

ఏపీ కేబినెట్ భేటీ లో పలు కీలక నిర్ణయాలు

ఏపీ కేబినెట్ భేటీ లో పలు కీలక నిర్ణయాలు

కరోనా నేపథ్యంలో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. దీన్ని ఎలా అరికట్టాలనే దానిపై ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశంలో పూర్థిస్థాయిలో చర్చ జరిగింది. సుమారు రెండు గంటలపాటు జరిగిన ఈ క్యాబినెట్ భేటీలో ముఖ్య మంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ భేటీలో కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణ నిరంతర పర్యవేక్షణకు కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.

ఐదుగురు మంత్రులతో సబ్ కమిటీ:

ఐదుగురు మంత్రులతో ఏపీ సర్కార్‌ కమిటీ వేసింది. ఈ కమిటీలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కన్నబాబు సభ్యులుగా ఉన్నారు. ప్రతి రోజూ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి అవసరమైన మేరకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు సీఎం జగన్‌ ఆదేశించారు.

బడ్జెట్‌కు గ్రీన్ సిగ్నల్:

మూడు నెలల బడ్జెట్‌కు ఆమోదం తీసుకుంటూ ఆర్డినెన్స్‌ జారీకి కేబినెట్ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధకానికి తీసుకుంటున్న చర్యలపై కేబినెట్‌ సబ్‌ కమిటీకి వైద్యశాఖ ఉన్నతాధికారులు వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలపై జిల్లాకు 2 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆర్ధిక ప్రగతి కుదేలైందని కెబినెట్ అభిప్రాయపడింది. ఆర్ధికంగా దేశానికి, రాష్ట్రాలకూ కోలుకోలేని దెబ్బ తగిలిందన్న సీఎం జగన్ ఈ భేటీలో మంత్రులకు వివరించారు. నిరోధక చర్యలపై అవసరమైన ఖర్చుకి వెనకాడవద్దని ఈ సందర్భంగా సీఎం తేల్చిచెప్పారు.

అక్కడే వారందరికీ వసతులు:

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను అక్కడే ఉంచి.. వారికి వసతి, భోజన సౌకర్యాలు కల్పించేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరపాలని మంత్రులు, ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకున్న వారికీ ఆ రాష్ట్రం వసతి కల్పించకుంటే.. మన ప్రభుత్వమే ఆ ఖర్చు భరించాలని కేబినెట్‌ భేటీలో నిర్ణయించారు.

మీతో మేం ఉన్నాం:

ఇదిలా ఉంటే.. కాశీలో చిక్కుకున్న తెలుగు వారికి అక్కడే యూపీ, ఏపీ ప్రభుత్వాలు భోజన ఏర్పాట్లు చేయనున్నాయి. ఇల్లుకూడా లేకుండా రోడ్లపైనే నివసించే వారికోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వారిని కల్యాణ మండపాలకు తరలించి అక్కడే వారికి ఏపీ ప్రభుత్వం భోజన ఏర్పాట్లు చేయనున్నది.

Jojobet Girişİmajbetcasibomjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetcasibomgrandpashabet