iDreamPost
android-app
ios-app

మహేష్ నో చెప్పాడా

  • Published Mar 10, 2020 | 6:27 AM Updated Updated Mar 10, 2020 | 6:27 AM
మహేష్ నో చెప్పాడా

మెగాస్టార్ ఆచార్యలో మహేష్ బాబు ఒక స్పెషల్ క్యామియో చేస్తాడనే ప్రచారం ఓ రెండు వారల క్రితం చాలా బలంగా జరిగింది. అన్ని మీడియా మాధ్యమాల్లోనూ ఇదే హై లైట్ న్యూస్ అయ్యింది. ఈ వార్త లైమ్ లైట్ లో ఉన్నప్పుడు మహేష్ యాడ్ షూట్ కోసం ముంబైలో ఉన్నాడు. తాజాగా హిమాలయాలకు వెళ్లే ప్లాన్ లో ఉన్నట్టు ఫ్రెష్ అప్ డేట్ వస్తోంది. మరి చిరు సినిమాలో నటించే దాని గురించి క్లారిటీ అడిగితే తన సన్నిహితుల వద్ద దాదాపుగా నో చెప్పినట్టు సమాచారం.

కొరటాల శివతో ఉన్న బాండింగ్ కారణంగా కథను విన్న మహేష్ లైన్ పట్ల ఇంప్రెస్ అయ్యాడు కానీ కెరీర్లో ఎన్నడూ లేనిది ఇప్పుడీ ప్రత్యేక పాత్రలు ఎందుకనే ఆలోచనలో ఉన్నట్టుగా వినికిడి. చేస్తే ఆర్ఆర్ఆర్ తరహాలో మల్టీ స్టారర్ చేస్తేనన్నా ఉపయోగం ఉంటుంది కానీ వేరే హీరో టైటిల్ రోల్ చేసే సినిమాలో తాను కాసేపు కనిపించడం అభిమానులు ఎంత వరకు ఒప్పుకుంటారు అనే అనుమానంలో ఉన్నట్టు తెలిసింది. సూపర్ స్టార్ కృష్ణ గారు సైతం గతంలో ఇలాంటి పాత్రలు చాలా చేశారు. నాగార్జున వారసుడు లాంటివి మంచి పేరు కూడా తీసుకొచ్చాయి కూడా.

కానీ అవన్నీ ఆయన లేట్ ఏజ్ లో చేసినవి. మహేష్ అలా కాదు. ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. మినిమమ్ వంద కోట్ల మార్కెట్ తో రేస్ లో దూసుకుపోతున్నాడు. ఇలాంటి టైంలో రిస్కులు చేసి ఫ్యాన్స్ కు నచ్చని నిర్ణయాలు తీసుకోవడం కంటే వేచి చూడటమే బెటరని అనుకుంటున్నారట. ఇప్పుడిది నిజమైతే అరుదైన కాంబినేషన్ ని తెరమీద చూస్తామన్న సినిమా ప్రియుల కోరిక నెరవేరనట్టే. మరి ఆచార్యలో చాలా కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే ఆ స్టూడెంట్ లీడర్ పాత్రను రామ్ చరణ్ కాకుండా ఇంకే హీరోతో చేయిస్తారో వేచి చూడాలి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet