iDreamPost
iDreamPost
స్థానిక సంస్థల ఎన్నికల వేళ చిత్తూరు జిల్లా జనసేన నాయకులు కిడ్నాప్ డ్రామాకి తెరలేపారు. వై.యస్.ఆర్.సి.పి నాయకులపై ఆరోపణలే టార్గెట్ గా పథకం రచించిన జనసేన నాయకులు పోలీసులు రంగంలోకి దిగడంతో అడ్డంగా బుక్కయ్యారు. వివరాలోకి వెళితే రేణిగుంట జనసేన జడ్పీటీసీ అభ్యర్థి షాహిద్ ను శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జ్ “నగరం వినూత” తన ఇంట్లో దాచిపెట్టి తమ అభ్యర్ధిని వై.సి.పి నాయకులు కిడ్నప్ చేశారని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో షాహిద్ కనిపించడంలేదని కుటుంబ సభ్యులు చేసిన పిర్యాదుతో రంగంలోకి దిగిన రేణిగుంట పోలీసులు నగరం వినుత వ్యవహారశైలితో అనుమానం వచ్చి “వినూత” ఇంట్లో సోదాలు జరిపేందుకు ప్రయత్నించగా జనసేన నేత పసుపులేటి హరిప్రసాద్ పోలీసులను అడ్డుకుని బెదిరింపులకు దిగారు. తాము తలచుకుంటే కేంద్ర హోం శాఖ దిగుతుందంటూ వీరంగం వేశారు ఎట్టకేలకు పోలీసుల సోదాతో జనసేన నాయకుల డ్రామా బయటపడటంతో అభ్యర్థినిని దాచి అబద్దం ఆడినందుకు , పోలీసులను అడ్డుకున్నందుకు “వినూత” మరో ముగ్గురు జనసేన నాయకుల మీద రేణిగుంట పోలీసులు కేసులు నమోదు చేశారు.