iDreamPost
iDreamPost
పింక్ సినిమా రీమేక్ లో ఉన్న జనసేన పార్టి అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎట్టకేలకు బయటికి వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపద్యంలో జనసేన బీ.జే.పి తో కలిసి ఉమ్మడి విజన్ డాక్యుమెంట్ ని విడుదల చేశారు, ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతు గత తెలుగుదేశం ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉంటే, ప్రస్తుత వై.యస్.ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పూర్తిగా దౌర్జన్యాలకు పాల్పడుతు ఏకపక్షంగా వ్యవహరిస్తుందని చెప్పుకోచ్చారు. రాష్ట్ర వ్యప్తంగా వై.సి.పి కార్యకర్తలు బీజేపి జనసేన కార్యకర్తలపై దాడులకు దిగితున్నారని, పోలీసులని అడ్డుపెట్టుకుని ఎన్నికలను నడుపుతున్నారని, కొంతమంది పొలీసులు జగన్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని పవన్ కళ్యాణ్ వివాదాస్పద వాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ తక్షణం తగు చర్యలు తీసుకోవాలి పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
అయితే స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు పూర్తిగా అర్ధ రహితమని వై.యస్.ఆర్ కాంగ్రెస్ శాసనసభ్యులు టి.జే.ఆర్ సుధాకర్ బాబు అన్నారు. చంద్రబాబు చెప్పేదే పవన్ కల్యాణ్ చెస్తున్నారని టీజెఆర్ విమర్శించారు. పిన్నెల్లి రామ కృష్ణా రెడ్డిపై దాడి జరిగిన రోజు పవన్ ఎందుకు మాట్లాడలేదొ చెప్పాలని ఆయన నిలదీశారు. జగన్ కి వస్తున్న ఆదరణ చూసి ఒర్వలేకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అడ్డగోలు విమర్శలు చెస్తున్నారని చెప్పుకోచ్చారు. మంత్రి బొత్సా మాట్లాడుతు పవన్ కల్యాణ్ అర్ధం లేకుండా మాట్లాడుతున్నారని రాష్ట్రంలో 9,696 ఎంపీటీసీ స్థానాలు ఉంటే..వాటికి సుమారు 50,063 నామినేషన్లు దాఖలు అయ్యయని, అందులో వైయస్‌ఆర్‌సీపీ 23 వేలు, టీడీపీ 18 వేలు, జనసేన 2 వేలు, బీజేపీ 1800 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారని. మీ అభ్యర్థులను బూత్ వరకు రాకుండా అడ్డుకుని ఉంటే వీళ్లంతా ఎలా నామినేషన్ వేశారొ విమర్శలు చెస్తున్న పవన్ కల్యాణ్, చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు.