iDreamPost
android-app
ios-app

ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ ఎదో కొత్తగా కుక్ చేస్తున్నాడు..

  • Published Jan 02, 2026 | 12:25 PM Updated Updated Jan 02, 2026 | 12:25 PM

సందీప్ రెడ్డి వంగకు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా కట్ అవుట్ దొరికితే... ఇక బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే. అది బాడీ కాదు బాక్స్ ఆఫీస్ .. అంటూ ఇలా సోషల్ మీడియాలో రెండు రోజుల నుంచి ఒకటే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటో తెలియనిది కాదు. ప్రభాస్ బర్త్ డే రోజు ఓ వాయిస్ నోట్.. న్యూ ఇయర్ సంధర్బంగా ఓ బ్యాక్ లుక్ పోస్టర్.

  • Published Jan 02, 2026 | 12:25 PMUpdated Jan 02, 2026 | 12:25 PM
ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగ ఎదో కొత్తగా కుక్ చేస్తున్నాడు..

సందీప్ రెడ్డి వంగకు ప్రభాస్ లాంటి పాన్ ఇండియా కట్ అవుట్ దొరికితే… ఇక బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే. అది బాడీ కాదు బాక్స్ ఆఫీస్ .. అంటూ ఇలా సోషల్ మీడియాలో రెండు రోజుల నుంచి ఒకటే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దానికి కారణం ఏంటో తెలియనిది కాదు. ప్రభాస్ బర్త్ డే రోజు ఓ వాయిస్ నోట్.. న్యూ ఇయర్ సంధర్బంగా ఓ బ్యాక్ లుక్ పోస్టర్. ఈ రెండిటికె సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది . అసలు సినిమా వస్తే ఇంకా ఆ హైప్ ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సందీప్ తాలూకా ఇంటెన్సిటీ ఈ పోస్టర్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ఒకే ఒక్క పోస్టర్ ఈ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా అనేలా ఉంది ఆ పోస్టర్. ఒంటినిండా గాయాలుతో ప్ర‌భాస్, లైట‌ర్ తో సిగ‌రెట్ వెలిగిస్తున్న త్రిప్తి. ప్ర‌భాస్ పొడ‌వైన జుట్టు.. ఆ బాడీ.. ఆ ఫైర్‌.. టోటల్ గా ప్రభాస్ కటౌట్ సోషల్ మీడియాను షేక్ చేసింది. ఎలాగూ సందీప్‌రెడ్డి టేకింగ్ లో, మేకింగ్ లో మ్యాజిక్ ఉంటుంది. ఆ మ్యాజిక్ ప్రభాస్ తో కూడా వర్కౌట్ అయితే మరో వెయ్యి కోట్ల రికార్డ్ డార్లింగ్ సొంతం అవుతుంది. పైగా ఈసారి సందీప్ చాలా బలమైన కథతో వస్తున్నాడని ఇన్సైడ్ టాక్. అంతా బానే ఉంటె ఇక డార్లింగ్ ఫ్యాన్స్ కు పండగే. ఇక ముందు ముందు ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.