iDreamPost
android-app
ios-app

ఈ సంక్రాంతికి టాలీవుడ్ బడ్జెట్ ఏకంగా రూ.1500 కోట్లు ?

  • Published Jan 03, 2026 | 12:41 PM Updated Updated Jan 03, 2026 | 12:41 PM

ఇంకొక వారం రోజుల్లో సినిమాల పండుగ మొదలైపోతుంది. దాదాపు ఈ నెలాఖరు వరకు థియేటర్స్ కలకాలాడుతూనే ఉంటాయి. ఇక ఈ సంక్రాంతికి ఏకంగా 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి . ఇన్ని సినిమాలు రిలీజ్ అవ్వడం బహుశా ఇదే మొదటిసారేమో . భోగి, సంక్రాంతి, క‌నుమ‌ ఇలా మూడు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో సినిమా రిలీజ్ అవుతుంది.

  • Published Jan 03, 2026 | 12:41 PMUpdated Jan 03, 2026 | 12:41 PM
ఈ సంక్రాంతికి  టాలీవుడ్ బడ్జెట్ ఏకంగా రూ.1500 కోట్లు ?

ఇంకొక వారం రోజుల్లో సినిమాల పండుగ మొదలైపోతుంది. దాదాపు ఈ నెలాఖరు వరకు థియేటర్స్ కలకాలాడుతూనే ఉంటాయి. ఇక ఈ సంక్రాంతికి ఏకంగా 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి . ఇన్ని సినిమాలు రిలీజ్ అవ్వడం బహుశా ఇదే మొదటిసారేమో . భోగి, సంక్రాంతి, క‌నుమ‌ ఇలా మూడు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో సినిమా రిలీజ్ అవుతుంది. వీటి అన్నిటికి వారం ముందు రాజాసాబ్ , రెండు రోజుల ముందు మన శంకర వరప్రసాద్ గారు వస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది.

అటు ప్రేక్షకులు ఇటు థియేటర్ ఓనర్స్ అందరు హ్యాపీగానే ఉంటారు కానీ.. ఇక్కడ కొంత రిస్క్ కూడా ఉంది. ముఖ్యంగా ప్రేక్షకులు ఇన్ని సినిమాలను కవర్ చేయగలరా లేదా అనేది కూడా చూసుకోవాలి . ఇలా చూసుకుంటే మీడియం రేంజ్ సినిమాలకు ఇది కాస్త రిస్క్ ఏ.. ఇక బడ్జెట్ విషయానికొస్తే.. అన్ని సినిమాలు కలిపి దగ్గర్లో దగ్గర ఓ రూ.1000 కోట్లు ఉంటుందని ట్రేడ్ పండితుల అంచనా. దానిలో కేవలం ‘రాజాసాబ్’ బ‌డ్జెట్ అటూ ఇటుగా రూ.500 కోట్లు ఉండొచ్చట. ‘మ‌న శంక‌ర వ‌ర ప్ర‌సాద్ గారు’ కోసం రూ.200 కోట్లు ఖర్చు చేశారు.

ఇక మిగిలిన సినిమాలకు ఆ రేంజ్ కి తగినట్లు అంచనా వేశారు. అలా నిర్మాతల చేతికి రూ.1000 కోట్లు రావాలంటే బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఈ సినిమాల‌న్నీ క‌లిపి దాదాపు రూ.1500 కోట్లు రాబట్టాల్సిందే. అప్పుడు ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలు , అవి తీసిన దర్శక నిర్మాతలు లాభాల బాటపడతారు. తెలుగు ప్రేక్షకుల నుంచి ఇది ఎంతవరకు సాధ్యం అనేదే ప్రశ్న . ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే సంక్రాంతి సీజన్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.