Swetha
గడిచిన సంవత్సరం టాలీవుడ్ కి ఎందుకో అంత కలిసిరాలేదు. కనీసం ఒక పాన్ ఇండియా సినిమా కూడా రాకపోవడం మరో కారణం. ఓజి , అఖండ 2, వార్ 2 లాంటి కొన్ని సినిమాలు వచ్చాయిలే కానీ మరీ ఊహించినంత రేంజ్ ను అందుకోలేకపోయాయి. కానీ ఈ ఏడాది అలా కాదు ఒకటి కాదు రెండు కాదు చాలానే పాన్ ఇండియా సినిమాలు రెడీగా ఉన్నాయి.
గడిచిన సంవత్సరం టాలీవుడ్ కి ఎందుకో అంత కలిసిరాలేదు. కనీసం ఒక పాన్ ఇండియా సినిమా కూడా రాకపోవడం మరో కారణం. ఓజి , అఖండ 2, వార్ 2 లాంటి కొన్ని సినిమాలు వచ్చాయిలే కానీ మరీ ఊహించినంత రేంజ్ ను అందుకోలేకపోయాయి. కానీ ఈ ఏడాది అలా కాదు ఒకటి కాదు రెండు కాదు చాలానే పాన్ ఇండియా సినిమాలు రెడీగా ఉన్నాయి.
Swetha
గడిచిన సంవత్సరం టాలీవుడ్ కి ఎందుకో అంత కలిసిరాలేదు. కనీసం ఒక పాన్ ఇండియా సినిమా కూడా రాకపోవడం మరో కారణం. ఓజి , అఖండ 2, వార్ 2 లాంటి కొన్ని సినిమాలు వచ్చాయిలే కానీ మరీ ఊహించినంత రేంజ్ ను అందుకోలేకపోయాయి. కానీ ఈ ఏడాది అలా కాదు ఒకటి కాదు రెండు కాదు చాలానే పాన్ ఇండియా సినిమాలు రెడీగా ఉన్నాయి. రాజాసాబ్ తో దీనికి బోణి మొదలైంది. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఈ సందడి మొదలైంది.
ఇక నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా. ఈ సినిమా మీద విపరీతమైన హైప్ ఉంది. సమ్మర్ ను టార్గెట్ చేసుకుని ఈ సినిమా రిలీజ్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇక దానికంటే ముందే రామ్ చరణ్ పెద్ది సినిమా రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ సినిమా నుంచి రిలీజ్ అయినా చికిరి చికిరి కి నేషనల్ వైడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక న్యాచురల్ స్టార్ నాని నటించిన ప్యారడైజ్ కు వేరే లెవెల్ బజ్ ఉంది. ఎందుకంటే ఇంతవరకు నాని ని ఈ లుక్ లో ఎప్పుడు చూసింది లేదు. పైగా ప్యూర్ బ్లడ్ బాత్ లా అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఇది కూడా మార్చిలో వచ్చేస్తుంది.
ఇంకా ఎప్పుడో రిలీజ్ కావాల్సిన పాన్ ఇండియా సినిమా విశ్వంభర.. ఇంకా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయలేదు కానీ పక్కాగా ఈ సంవత్సరంలోనే రిలీజ్ అవుతుంది. అలాగే నిఖిల్ స్వయంభు మేకింగ్ వీడియోకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ ఏ ఉంది. ప్రభాస్ స్పిరిట్ కూడా డిసెంబర్ లో రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది కానీ ఎంతవరకు సాధ్యం అవుతుందో చూడాలి. ఇవి కాకుండా ఇంకా ఎన్ని పాన్ ఇండియా సినిమాలు ఆరంభం అవుతాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.