iDreamPost
android-app
ios-app

సంక్రాంతి రిలీజ్ ల ప్రీమియర్స్ టికెట్ రేట్స్ ఇవే

  • Published Jan 03, 2026 | 11:11 AM Updated Updated Jan 03, 2026 | 11:11 AM

సంక్రాంతి పండగకు ఇంకో రెండు వారాల సమయం ఉంది. కానీ సినిమాల పండగ మాత్రం మరో వారం రోజుల్లో మొదలైపోతుంది. ఈసారి అందరికంటే ముందుగా వస్తుంది మాత్రం రాజాసాబ్. జనవరి 9 న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఓ రోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. ప్రభాస్ సినిమా అంటే ప్రీమియర్స్ కొత్తేమి కాదు..

  • Published Jan 03, 2026 | 11:11 AMUpdated Jan 03, 2026 | 11:11 AM
సంక్రాంతి రిలీజ్ ల ప్రీమియర్స్ టికెట్ రేట్స్ ఇవే

సంక్రాంతి పండగకు ఇంకో రెండు వారాల సమయం ఉంది. కానీ సినిమాల పండగ మాత్రం మరో వారం రోజుల్లో మొదలైపోతుంది. ఈసారి అందరికంటే ముందుగా వస్తుంది మాత్రం రాజాసాబ్. జనవరి 9 న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఓ రోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. ప్రభాస్ సినిమా అంటే ప్రీమియర్స్ కొత్తేమి కాదు. ఈ సినిమాకు ప్రీమియర్ టికెట్ ధర రూ.800 పెట్టాల‌ని చూస్తున్నార‌ట‌. అలాగే కంబ్యాక్ లో ఓ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నారు చిరంజీవి .

ఈ సినిమాను జనవరి 12న రిలీజ్ చేయనున్నారు. దానికంటే ఒక్క రోజు ముందే ఈ సినిమాకు కూడా పెయిడ్ ప్రీమియర్స్ వేసేందుకు రెడీగా ఉన్నారు టీం. ఈ షోస్ కు కూడా స్పెషల్ రేట్స్ ఉన్నాయట. అయితే ఇది ఫ్యామిలీ మూవీ కాబట్టి ఇక్కడ రేట్లు కాస్త రీజనబుల్ గానే ఉంటాయట. అఖండ సమయంలో టికెట్ ధర రూ. 600 వరకు ఉంది. ఇక ఈ సినిమాకు ఇంకాస్త తగ్గించే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత కూడా ధరలను ప్రేక్షకులకు అందుబాటులోనే ఉంచుతారనే టాక్ వినిపిస్తుంది.

సంక్రాంతి రేస్ లో ప్రస్తుతం ఈ రెండే పెద్ద సినిమాలు. ఎక్స్ట్రా రేట్స్ ఏమైనా ఉంటె ఈ రెండిటికే ఉంటాయట. మిగిలిన వాటికి నార్మల్ గానే ఉంటాయని టాక్. ఇక ఈ రెండిటికి తెలంగాణలో అదనపు రేట్లు దక్కుతాయా లేదా అనేది చూడాలి. ముందు రాజాసాబ్ కు ఛాన్స్ ఇస్తే అప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారికి కూడా అవకాశం ఉంటుంది. లేదంటే రెండిటికి లేనట్టే. ఇక ఏమౌతుందో .. ముందు ముందు ఈ సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.