iDreamPost
android-app
ios-app

రాజాసాబ్ ఫైనల్ రన్ టైం ఎంతంటే !

  • Published Jan 03, 2026 | 3:13 PM Updated Updated Jan 03, 2026 | 3:13 PM

సరిగ్గా ఇంకో వారం రోజుల్లో రాజాసాబ్ థియేటర్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేస్తాడు. మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ప్రభాస్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు డార్లింగ్ డై హార్ట్ ఫ్యాన్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో మంచి హైప్ ని క్రియేట్ చేసింది. అటు ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి.

సరిగ్గా ఇంకో వారం రోజుల్లో రాజాసాబ్ థియేటర్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేస్తాడు. మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ప్రభాస్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు డార్లింగ్ డై హార్ట్ ఫ్యాన్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో మంచి హైప్ ని క్రియేట్ చేసింది. అటు ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి.

  • Published Jan 03, 2026 | 3:13 PMUpdated Jan 03, 2026 | 3:13 PM
రాజాసాబ్ ఫైనల్ రన్ టైం ఎంతంటే !

సరిగ్గా ఇంకో వారం రోజుల్లో రాజాసాబ్ థియేటర్స్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేస్తాడు. మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ప్రభాస్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు డార్లింగ్ డై హార్ట్ ఫ్యాన్స్. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులలో మంచి హైప్ ని క్రియేట్ చేసింది. అటు ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. రీసెంట్ గా జరిగిన రీ రిలీజ్ ఈవెంట్ బాగానే వర్కౌట్ అయింది. ఇదిలా ఉంటే ఇంకోవైపు రాజాసాబ్ సెన్సార్ కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుంది.

సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చిందంట. అలాగే సినిమా రన్ మొదట టైం 183 నిమిషాలు వచ్చిందట. అంటే మూడు గంటల మూడు నిమిషాలు. కానీ ఇప్పుడు సెన్సార్ కట్ తర్వాత ఫైనల్ గా రెండు గంటల 55 నిముషాలుగా లాక్ చేశారట. అంటే రన్ టైం మూడు గంటల లోపే ఉంటుందున్నమాట. ఇది ఓ రకంగా సినిమాకు ప్లస్ పాయింట్ ఏ అవుతుంది. ఎంత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అయినా మూడు గంటలకు మించి ఆడియన్స్ ను ఎంగేజ్ చేయాలంటే కాస్త కూస్తో ఇబ్బందికరమైన విషయమే. కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు.

అది కాకుండా ఆడియన్స్ కు ఇంకాస్త ఎగ్జైటింగ్ గా అనిపించే మ్యాటర్ ఏంటంటే.. డార్లింగ్ ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయడం. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌ ఈ ముగ్గురు భామలు ఎలాంటి స్క్రీన్ ప్రెజెన్స్ కనబరిచారా అనే ఉత్సాహం కొందరిలో.. అసలు హర్రర్ జోనర్ లో డార్లింగ్ ఎలా నటించాడా అని ఇంకొందరిలో.. అసలు కథ ఏమైఉంటుంది అనే అందరిలో.. ఇలా సినిమా మీద రకరకాల ఊహాగానాలు సందేహాలు ఉన్నాయి. అవి ఇంకొద్ది రోజుల్లో వాటి అన్నిటికి సమాధానం దొరికేస్తుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.