పోలీసులకు చిరు సెల్యూట్ – సర్కారుపై పవన్ గుస్సా వారిద్దరూ అన్నదమ్ములు ..ఇద్దరూ రాజకీయ నాయకులు…అయితే ప్రస్తుత కోవిడ్ వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో ఒకొక్కరు ఒక్కోలా స్పందించారు. వారిలో అన్న ప్రభుత్వాన్ని కొనియాడితే తమ్ముడు మాత్రం ఆ ఆపత్కాలంలో రాజకీయ కోణాన్ని వెతికారు..ఆ బ్రదర్స్ ఇంకెవరో కాదు.. మెగా బ్రదర్స్ చిరంజీవి,పవన్ కళ్యాణ్. ..కరోనా నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా పేదలు నానా అవస్థలు పడుతున్నారు. అయినా సరే ప్రజల ప్రాణాలు పోతున్న తరుణంలో లాక్ డవున్ ను […]
రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్ నిమ్మగడ్డ లేఖ వ్యవహారం ఇంకా చల్లబడకుండానే ప్రభుత్వం పై ఫిర్యాధు చేస్తు మరో అధికారి గవర్నర్ ను కలిసారని ఆంధ్రజ్యోతి పత్రిక లో ఒక కధనం ప్రచురితం అయింది . ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఈ కధనం ప్రకారం, ఏపీపీఎస్సీ చైర్మన్ పిన్నమనేని ఉదయభాస్కర్ శుక్రవారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి తన గోడును వెళ్లబోసుకున్నారని గత ఏడాది నవంబర్ నుండి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను వివరిస్తూ మూడుపేజీల లేఖను గవర్నర్ […]
ఆయన ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు. సీనియర్ రాజకీయ నాయకుడు. పలుమార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. అలాంటి వ్యక్తికి తన సొంత ప్రాంతంలో దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మొన్నటికి మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఒక ఎత్తయితే.. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పరువు పోగొట్టుకున్నారు. తన సొంత మండలంలో కనీసం పోటీకి అభ్యర్థులు నిలబెట్టలేక చతికిలబడ్డారు. ఆయనెవరో కాదు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం ప్రభావం […]
రాజకీయాల్లో అవసరానికి వ్యక్తులని ఉపయోగించుకోవడం, అవసరం తీరిపొయాక అదే వ్యక్తులని పక్కన పెట్టడం తరుచూ చూస్తు ఉంటాము. తెలుగుదేశం అధినేత చంద్రబాబులో మాత్రం ఈ ధోరణి కాస్త అధికంగా ఉందనే చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు తనయుడు కీర్తిశేషులు హరికృష్ణ దగ్గరనుండి మోత్కుపల్లి నరసింహులు దాక చంద్రబాబు తమని అవసరానికి ఉపయోగించుకొని పక్కన పెట్టారు అని చెప్పిన వ్యక్తులే. ఈ మాటలను మరోసారి రుజువు చేస్తూ రాష్ట్రంలో 4 రాజ్యసభ స్థానాలకు జరుగనున్న […]
పింక్ సినిమా రీమేక్ లో ఉన్న జనసేన పార్టి అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎట్టకేలకు బయటికి వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపద్యంలో జనసేన బీ.జే.పి తో కలిసి ఉమ్మడి విజన్ డాక్యుమెంట్ ని విడుదల చేశారు, ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతు గత తెలుగుదేశం ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉంటే, ప్రస్తుత వై.యస్.ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పూర్తిగా దౌర్జన్యాలకు పాల్పడుతు ఏకపక్షంగా వ్యవహరిస్తుందని చెప్పుకోచ్చారు. రాష్ట్ర వ్యప్తంగా వై.సి.పి కార్యకర్తలు […]
జార్ఖండ్ నుండి రెండుసార్లు రాజ్యసభకు ఎంపికైన పరిమళ నత్వాని ఈ సారి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభ కి ఎంపికయ్యారు. ఎవరూ ఊహించని విధంగా చివరి నిమిషంలో అంబానీ ద్వారా తెరపైకి వచ్చిన ఈ పేరు ఇప్పుడు తెలుగు రాజకియ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రిలయన్స్ అధినేతకు స్నేహితుడిగా , మోడీ , అమిత్ షాలకు అత్యంత దగ్గర మనిషిగా పేరు ఉన్న పరిమళ నత్వాని దేశ వ్యాపార రంగాల్లో కీలకమైన వ్యక్తిగా […]
ఏదైనా అనుకున్నది సాధించాలంటే అన్నింటికీ ఎదురొడ్డి నిలవాల్సిందే . ఏటికి ఎదురీత అని ఎంతోమంది అనుకున్నా, నిలబడి ముందుకు సాగితేనే అనుకున్నది సాధించగలరు. ఈ విషయం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సిపి వ్యవస్థాపకుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో స్పష్టం అయింది. దశాబ్ద కాలం క్రితం పార్టీని స్థాపించి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని చివరకు విజయ తీరాలకు చేరిన నాయకుడిగా జగన్ నిలబడ్డారు. చరిత్రలోనే ప్రత్యేకతను సాధించారు. అప్పట్లో అంతా కాంగ్రెస్ హవా నడుస్తోంది. ఆ దశలో […]
సీనియర్ టిడిపి నాయకుడు, ప్రకాశం జిల్లా చీరాల శాసనసభ్యుడు కరణం బలరాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇవాళ రాత్రికి కరణం బలరాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కరణం బలరాం,ఆయన తనయుడు వెంకటేష్ గత ఎన్నికలకు ముందే వైఎస్సార్ సీపీలో చేరుతారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. బలరాం అడిగిన సీట్లు ఇవ్వటానికి వైసీపీ తిరష్కరించటంతో ఆయన టీడీపీ లోనే కొనసాగాడు. చీరాల శాససభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ […]
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ప్రతిపక్ష టీడీపీ నుంచి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో వైఎస్సార్ కడప జిల్లాలో ఈ రోజు ప్రతిపక్ష పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి, జమ్మలమడుగు టీడీపీ నేత రామసుబ్బారెడ్డి, దివంగత నేత బాంబుల శివారెడ్డి కుమారుడు గిరిధర్ రెడ్డి తో పాటు తన అనుచరులతో కలసి బుధవారం సాయంత్రం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. Also Read […]
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, సర్పంచ్ పదవుల మధ్య పోటీ నెలకొంది. ఈ పోటీలో ఎంపీటీసీ పదవి వెనకబడిపోతోంది. సర్పంచ్ పదవి దూసుకెళుతోంది. అభ్యర్థులు సర్పంచ్ పదవిపైనే మోజు పెంచుకున్నారు. పలు చోట్ల ఎంపీటీసీ పదవికి పోటీ చేసే వారు కరువయ్యారు. ఈ రోజు బుధవారం ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల దాఖలుకు ఆఖరు రోజు కావడంతో.. ఎలాగోలా నామినేషన్లు వేయించేందుకు నేతలు ఉరుకులు పరుగులుపెడుతున్నారు. అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఈ పరిస్థితి ఉందంటే సర్పంచ్ […]