Swetha
ఓ కథను మూడు గంటల్లో ముగించేసే రోజులు పోయాయి. దాదాపు అన్నీ రెండు పార్ట్స్ గా వస్తున్నాయి. ఇది థియేటర్స్ వరకే పరిమితం. కానీ ఓటిటి లకు ఇలాంటి లెక్కలు పట్టింపులు లేవు కాబట్టి... కథను ఎంతైనా పొడిగించొచ్చు ప్రేక్షకులు ఆ కథపై చూపించే ఇంట్రెస్ట్ ని బట్టి ఆ కథ కొనసాగుతూ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఓటిటి లలో సిరీస్ లకు క్రేజ్ బాగా పెరిగింది.
ఓ కథను మూడు గంటల్లో ముగించేసే రోజులు పోయాయి. దాదాపు అన్నీ రెండు పార్ట్స్ గా వస్తున్నాయి. ఇది థియేటర్స్ వరకే పరిమితం. కానీ ఓటిటి లకు ఇలాంటి లెక్కలు పట్టింపులు లేవు కాబట్టి... కథను ఎంతైనా పొడిగించొచ్చు ప్రేక్షకులు ఆ కథపై చూపించే ఇంట్రెస్ట్ ని బట్టి ఆ కథ కొనసాగుతూ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఓటిటి లలో సిరీస్ లకు క్రేజ్ బాగా పెరిగింది.
Swetha
ఓ కథను మూడు గంటల్లో ముగించేసే రోజులు పోయాయి. దాదాపు అన్నీ రెండు పార్ట్స్ గా వస్తున్నాయి. ఇది థియేటర్స్ వరకే పరిమితం. కానీ ఓటిటి లకు ఇలాంటి లెక్కలు పట్టింపులు లేవు కాబట్టి… కథను ఎంతైనా పొడిగించొచ్చు ప్రేక్షకులు ఆ కథపై చూపించే ఇంట్రెస్ట్ ని బట్టి ఆ కథ కొనసాగుతూ ఉంటుంది. అందుకే ఇప్పుడు ఓటిటి లలో సిరీస్ లకు క్రేజ్ బాగా పెరిగింది. అలా ఓ సిరీస్ పదేళ్ల పాటు ఐదు సీజన్స్ గా ప్రేక్షకులను అలరించింది. ఈ ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్ మరోదే కాదు స్ట్రేంజర్ థింగ్స్.
2016లో మొదలై 2026లో ఈ సిరీస్ ముగిసింది. న్యూ ఇయర్ సంధర్బంగా ఆఖరి సీజన్ లో ఆఖరి ఎపిసోడ్ ను రిలీజ్ చేశారు మేకర్స్ . ఓ దశాబ్ద కాలం పాటు సాగిన ఈ సిరీస్ కు ఎండ్ కార్డ్ పడింది. అసలు ఈ స్ట్రేంజర్ థింగ్స్ కథేంటి అనే విషయానికొస్తే.. అది అమెరికాలోని హాకిన్స్ అనే గ్రామం. మైకేల్, విలియమ్, లూకస్, డస్టిన్ అనే నలుగురు పిల్లలు. ఓ రోజు రాత్రి మైకేల్ అలియాస్ మైక్ ఇంట్లో వీరంతా ఆడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఎవరి ఇంటికి వారు వెళ్ళిపోతారు. వీరిలో విల్ మాత్రం ఎక్కడో మిస్ అవుతాడు. అతని కోసం వెతుకుతూ ఉండగా ఎలెవన్ అనే అమ్మాయి కనిపిస్తుంది. ఈమెకు సూపర్ పవర్స్ ఉంటాయి. ఈమె ఎవరు ? ఆ సూపర్ పవర్స్ ఏంటి ? ఆ మిస్ అయిన కుర్రాడు ఎక్కడికి వెళ్తాడు ? ఆ తర్వాత ఏమైంది అనేదే ఈ సిరీస్ కథ.
ప్రతి ఎపిసోడ్ లోను ఊహించని ట్విస్ట్ లు , అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఉంటూ ప్రేక్షకులను బాగా ఎంగేజ్ చేస్తూ ఉంటాయి. ఐదు సీజన్స్ మీద కలిపి మొత్తం 42 ఎపిసోడ్స్ ఉంటాయి. తొలి మూడు సీజన్లలో ఒక్కో ఎపిసోడ్ 50 నిమిషాల పాటు ఉంటుంది. మిగిలిన ఎపిసోడ్స్ అన్నీ ఒక గంట అటు ఇటుగా ఉంటాయి . కానీ లాస్ట్ సీజన్ లాస్ట్ ఎపిసోడ్ మాత్రం ఏకంగా 2 గంటలు ఉంది. ఇక్కడ కథ చెప్పే విధానమే ప్రేక్షకులకు బాగా మెప్పిస్తుంది. ఇంకా ఈ సిరీస్ ఎవరైనా చూడకపోతే వెంటనే నెట్ ఫ్లిక్స్ లో చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.