iDreamPost
iDreamPost
టాలీవుడ్ స్టార్ హీరోల మార్కెట్ ఆకాశమే హద్దుగా పెరిగిపోతోంది. మొన్నటి దాకా బాహుబలి లాంటి సినిమాలతోనే వంద కోట్ల మార్కు సాధ్యమనే లెక్కలను తారుమారు చేస్తూ రంగస్థలం, సాహో, అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు లాంటి మూవీస్ సైతం ఆ మార్కును అలవోకగా అందుకోవడంతో ఓవర్సీస్ లోనూ టాలీవుడ్ సత్తా చాటుతోంది. రెండేళ్ల క్రితం అజ్ఞాతవాసి లాంటి ఆల్ టైం డిజాస్టర్ తోనూ అరవై కోట్ల దాకా వసూళ్లు తెచ్చిన పవన్ కళ్యాణ్ మీదే ఇప్పుడు అందరి దృష్టి మళ్లుతోంది.
పింక్ రీమేక్ గా రూపొందుతున్న లాయర్ సాబ్(రిజిస్టర్ చేసిన టైటిల్) మీద ఇప్పటికిప్పుడు భారీ అంచనాలు లేవు కానీ ప్రమోషన్ మొదలుపెట్టాక హైప్ వేరే లెవెల్ లో ఉంటుంది. ట్రేడ్ నుంచి స్పష్టమైన రిపోర్ట్స్ ఇంకా రానప్పటికీ ఇది ఎంత స్థాయిలో బిజినెస్ చేస్తుందనే దాని గురించి అప్పుడే రకరకాల క్యాలికులేషన్స్ మొదలయ్యాయి. పవన్ రెగ్యులర్ గా చేసే కమర్షియల్ మూవీస్ తరహాలో కాకుండా లాయర్ సాబ్ చాలా లిమిటెడ్ బడ్జెట్ తో రూపొందుతోంది. మాస్ అప్పీల్ తక్కువే. హీరో రెమ్యునరేషన్ ని పక్కనబెడితే మహా అయితే పది లేదా పదిహేను కోట్లలోనే ఈజీగా పూర్తి చేయొచ్చు.
అజయ్ తో తీసిన తమిళ వెర్షన్ కు ఇంతే అయ్యింది. కాబట్టి బిజినెస్ ని కూడా గరిష్టంగా 50 నుంచి 80 కోట్ల మధ్యలో క్లోజ్ చేయొచ్చని టాక్ ఉంది. అలా చేస్తే పవన్ ఇమేజ్ కు తగ్గట్టు కంటెంట్ ని బట్టి పెట్టుబడిని రాబట్టుకోవచ్చు. అలా కాకుండా 100 కోట్లు దాటి బిజినెస్ చేస్తే అంత మేర ఈ కోర్ట్ డ్రామా రాబట్టడం సులభం కాకపోవచ్చు. అందులోనూ ఇది రెగ్యులర్ ఆడియన్స్ అందరికి కనెక్ట్ అయ్యే సబ్జెక్టు కాదు. మరి దిల్ రాజు మనసులో ఏముందో డీల్స్ ఎంతకి ఫినిష్ చేస్తారో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగక తప్పదు