iDreamPost
iDreamPost
మంచి అంచనాల మధ్య విడుదలైన హిట్ 2 ది సెకండ్ కేస్ విజయవంతంగా ఫస్ట్ వీక్ ని పూర్తి చేసుకుంది. కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కు అతి దగ్గరగా వెళ్ళిపోయి నిర్మాత నాని నమ్మకాన్ని నిజం చేసింది. టాక్ ఏ కొంచెం అటుఇటు అయినా రిస్క్ అనిపించే పరిస్థితుల్లో ఒక క్రైమ్ థ్రిల్లర్ తో ఇంత అచీవ్ చేయడం మెచ్చుకోదగ్గ విషయం. ఈ రోజు నుంచి డ్రాప్ గణనీయంగానే ఉన్నప్పటికీ ఈవెనింగ్ సెకండ్ షోల ఆక్యుపెన్సీని బట్టి ఆ పర్సెంటేజ్ ఎంత ఉంటుందో ఒక అంచనాకు రావొచ్చు. బిసి సెంటర్లలో మాత్రం ఇది కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. పదిహేను కోట్లకు పైగా బిజినెస్ జరుపుకున్న హిట్ 2కి నాలుగు రోజులకే ఆ మొత్తం రావడం విశేషం
ఇక లెక్కల సంగతి చూస్తే నైజామ్ 4 కోట్ల 95 లక్షలు, సీడెడ్ 1 కోటి 7 ;లక్షలు, ఉత్తరాంధ్ర 1 కోటి 20 లక్షలు, గుంటూరు 70 లక్షలు, ఈస్ట్ వెస్ట్ కలిపి 94 లక్షలు, కృష్ణా 62 లక్షల దాకా షేర్ వసూలయ్యింది. తెలుగు రాష్ట్రాల నుంచే 9 కోట్ల 74 లక్షలు రావడం విశేషం. రెస్ట్ అఫ్ ఇండియా నుంచి 1 కోటి 55 లక్షలు, ఓవర్సీస్ నుంచి 3 కోట్ల 50 లక్షలు రాబట్టిన హిట్ ది సెకండ్ కేస్ వరల్డ్ వైడ్ గా మూడు రోజులకు గాను 14 కోట్ల 80 లక్షలు రాబట్టింది. గ్రాస్ ప్రకారమైతే ఇది 26 కోట్లను దాటేసింది. ఇంకొక్క 9 లక్షలు వచ్చేస్తే లాభాలు స్టార్ట్ అవుతాయి. ఉదయం ఆటలకే ఇది అయిపోయి ఉంటుంది కాబట్టి బయ్యర్లకు రాబోయేవన్నీ ప్రాఫిట్స్ కిందకే వస్తాయి. అంతగా సేఫ్ అయిపోయింది
శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్ 2ని త్వరలో హిందీ వెర్షన్ లోనూ రిలీజ్ చేయబోతున్నారు. జనవరిలో సంక్రాంతి సందడి ఉంటుంది కాబట్టి ఆలోగానే ప్లాన్ చేస్తున్నారు. క్రిస్మస్ కు వెళ్లే సాధ్యాసాధ్యాల గురించి పరిశీలన జరుగుతోంది. రణ్వీర్ సింగ్ రోహిత్ శెట్టిల సర్కస్ ఒకటే షెడ్యూల్ చేసి ఉండటంతో దీన్నో మంచి అవకాశంగా చూస్తున్నారు. అయితే హిట్ ది ఫస్ట్ కేస్ రీమేక్ అక్కడ వర్కౌట్ కాలేదు. రాజ్ కుమార్ రావు వెర్షన్ ని ఆడియన్స్ తిరస్కరించారు. మేజర్ తో వచ్చిన గుర్తింపు అడవి శేష్ కి ఇప్పుడు హిందీ వెర్షన్ మార్కెటింగ్ చేసుకునేందుకు ఉపయోగపడనుంది. హిట్ 3 కి సంబంధించిన పనులు ఆల్రెడీ మొదలయ్యాయని టాక్