Swetha
ప్రస్తుతం టీ టౌన్ లో మంచి ఫార్మ్ లో ఉన్న హీరోల్లో నాని ఒకరు. వరుస హిట్స్ తో నాని దూసుకుపోతున్నాడు . రీసెంట్ గా హిట్ 3 మూవీకి ఎలాంటి రెస్పాన్స్ లభించిందో తెలియనిది కాదు. అయితే నాని మరోసారి ఈ కాంబోని రిపీట్ చేయబోతున్నాడట. దానికి సంబంధించిన పూర్తి విషయాలు చూసేద్దాం.
ప్రస్తుతం టీ టౌన్ లో మంచి ఫార్మ్ లో ఉన్న హీరోల్లో నాని ఒకరు. వరుస హిట్స్ తో నాని దూసుకుపోతున్నాడు . రీసెంట్ గా హిట్ 3 మూవీకి ఎలాంటి రెస్పాన్స్ లభించిందో తెలియనిది కాదు. అయితే నాని మరోసారి ఈ కాంబోని రిపీట్ చేయబోతున్నాడట. దానికి సంబంధించిన పూర్తి విషయాలు చూసేద్దాం.
Swetha
దాదాపు టాలీవుడ్ లో హీరోలు అంత పాన్ ఇండియా సినిమాలు వైపు మొగ్గు చూపుతుంటే.. నాని మాత్రం తన పరిధిలో ఉండే సినిమాలను తీస్తూ డీసెంట్ హిట్స్ అందుకుంటున్నాడు. పైగా కొత్త డైరెక్టర్స్ ను ఎంకరేజ్ చేయడంలో నాని ఎప్పడు ముందుంటాడన్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా హిట్ 3 తో మరోసారి నాని దుమ్ము దులిపేశాడు. హిట్ 3 మూవీ కంప్లీట్ గా క్రైమ్ థ్రిల్లర్ అయినా కూడా.. కామన్ మూవీ లవర్స్ అందరికి థియేటర్ కు రప్పించడం అనేది ఒక్క నాని కి మాత్రమే సాధ్యం. హిట్ 1 , హిట్ 2 , హిట్ 3 ఈ సిక్వెన్స్ ఇప్పుడు అందరి ఫేవరేట్ అయిపోయింది. ఈ సినిమాలు ఏ జోనర్ .. ఎలాంటి కంటెంట్ ఉండబోతుంది దాదాపు అందరికి ఓ క్లారిటీ వచ్చేసింది. కంప్లీట్ గా అన్నీ కూడా క్రైమ్ డ్రామాలే.
అయితే ఇప్పుడు నాని మరోసారి ఈ డైరెక్టర్ తో జతకట్టబోతున్నాడట. అది కూడా కంప్లీట్ గా డిఫరెంట్ జోనర్ లో ఉండబోతుందట. హిట్ లాంటి బృటల్ యాక్షన్ సినిమాలు తీసిన దర్శకుడు కామెడీ జోనర్ లో సినిమా తీస్తే ఎలా ఉంటుంది ? అసలు అది సాధ్యమేనా ? అంటే అసలు ఇప్పటివరకు ప్రేక్షకులకు ఇలాంటి ఆలోచన కూడా వచ్చి ఉండదు. కానీ నాని ఈసారి ఇలాంటి ప్రయోగాన్ని చేయబోతున్నాడు . వైలెంట్ డైరెక్టర్ శైలేష్ కొలనులో నానికి కామెడీ యాంగిల్ కూడా కనిపించిందట. రాబోయే హిట్ సిరీస్ లో గెస్ట్ రోల్ ఉంటుందని. అది కాకుండా శైలేష్ తో ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీ కూడా ఉంటుందని నాని చెప్పుకొచ్చాడు.
సో కమింగ్ ఇయర్స్ కి నాని గట్టిగానే టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడని అర్ధమౌతుంది. ప్యారడైజ్ మూవీ ఎలాగూ భారీ హైప్ తో నే వస్తుంది. అలాగే ఇప్పుడు శైలేష్ తో ఈ కామెడీ ఎంటర్టైనర్ ఒకటి అనౌన్స్ చేసాడు. అటు సుజిత్ ఓ మూవీ టాక్స్ లో ఉన్నట్లు తెలుస్తుంది. సో మొత్తానికి నాని తన సినిమాలతో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ వడ్డించడానికి రెడీ అయిపోతున్నాడు. ఇక అవి బాక్స్ ఆఫీస్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయో చూడాలి. సో ఫైనల్ గా హిట్ 3 కాంబినేషన్ నుంచి ఈసారి నాన్ వైలెన్స్ సినిమా రాబోతుంది అని చెప్పాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.