iDreamPost
android-app
ios-app

మహేశ్ బాబుకి అది కరెక్ట్! నాకు ఇదే కరెక్ట్! నాని ఓపెన్ కామెంట్స్!

  • Published Aug 23, 2024 | 5:55 PM Updated Updated Aug 23, 2024 | 5:55 PM

Hero Nani On Mahesh Babu Pan India Project: సరిపోదా శనివారం ప్రమోషన్స్ తో నాని ఫుల్ బిజీగా మారిపోయాడు. అయితే ప్రమోషన్స్ లో భాగంగా మహేశ్ బాబు పాన్ ఇండియా స్ట్రాటజీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Hero Nani On Mahesh Babu Pan India Project: సరిపోదా శనివారం ప్రమోషన్స్ తో నాని ఫుల్ బిజీగా మారిపోయాడు. అయితే ప్రమోషన్స్ లో భాగంగా మహేశ్ బాబు పాన్ ఇండియా స్ట్రాటజీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

  • Published Aug 23, 2024 | 5:55 PMUpdated Aug 23, 2024 | 5:55 PM
మహేశ్ బాబుకి అది కరెక్ట్! నాకు ఇదే కరెక్ట్! నాని ఓపెన్ కామెంట్స్!

సరిపోదా శనివారం.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. న్యాచురల్ స్టార్ నాని ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్లో ఒక రీసౌండింగ్ ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు. అలాగే సినిమాతో తనలో ఉన్న ఊరమాస్ యాంగిల్ ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. టీజర్, ట్రైలర్ తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశారు. ఒక్క ఎస్జే సూర్యా మాత్రమే కాదు.. ఇందులో ఇంకా చాలామంది విలన్స్ ఉన్నారు. అలాగే హీరోలో కూడా చాలానే వేరియేషన్స్ ఉన్నాయి. నాని కూడా ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతున్నాడు.

నాని ఎంత బాగా యాక్ట్ చేస్తాడో.. అంతే బాగా మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తాడు. నాని దగ్గర పెద్దగా దాపరికాలు ఉండవు. అలాంటి వ్యక్తికి ఏ ప్రశ్న ఎదురైనా కూడా స్ట్రైట్ అవే సమాధానం వచ్చేస్తుంది. అలాగే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నానికి పాన్ ఇండియా సినిమా స్ట్రాటజీస్ గురించి ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. ‘నాని ఏమో సినిమా రిజల్ట్ తో సంబంధం లేదు.. పాన్ ఇండియా లెవల్లో ఒక్కో సినిమాకి ఫ్యాన్స్ ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తాను అంటారు’. మహేశ్ బాబులాంటి వాళ్లు ఇన్నాళ్లు వెయిట్ చేసి రాజమౌళిలాంటి బిగ్ డైరెక్టర్ తో ప్రాజెక్ట్ ఓకే చేసుకున్నారు. రెండింటిలో ఏ స్ట్రాటజీ కరెక్ట్? అంటారు అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చాలామంది తికమక పడటం, తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. నాని మాత్రం స్ట్రైట్ గా చెప్పేశాడు. పాన్ ఇండియా స్ట్రాటజీలో “మహేశ్ బాబుకు అది కరెక్ట్.. నానికి ఇది కరెక్ట్” ఇది కరెక్ట్ అని కుండ బద్దలు కొట్టేశాడు.

“మహేశ్ బాబు జర్నీ వేరు. ఆయన రావడమే సూపర్ స్టార్ గా వచ్చారు. కెరీర్ ప్రారంభం అప్పటికే ఆయనకు కొంత ఫ్యాన్ బేస్ ఉంది. అభిమానించే వాళ్లు ఉన్నారు. ఆయనకు ఇలా చిన్నగా ఫ్యాన్ బేస్ ని బిల్డ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక బిగ్గెస్ట్ డైరెక్టర్ తో ఒక బిగ్ బ్యాంగ్ తో వెళ్తున్నారు. ఆయన జర్నీకి అదే చాలా కరెక్ట్ స్ట్రాటజీ. కానీ, నాని జర్నీ వేరు. నాని వచ్చిన దారి వేరు. వేరే భాషల్లో కాదు.. నేను తెలుగులో కూడా సినిమా సినిమాకి ఫ్యాన్స్ ని బిల్డ్ చేసుకుంటూ వచ్చాను. వచ్చిన కొత్తలో నేను ఎవరో కూడా ఎవరికీ తెలీదు. నేను ప్రతి సినిమాని ఒక మెట్టుగానే చూడాలి.. ఆ మెట్టు ఎక్కితే చాలు అనుకున్నాను. ఒకేసారి నాగులు మెట్లు ఎక్కాలి అనుకోలేదు. అలాంటి ఆశ లేదు.. కోరిక లేదు.. అసలు అలా నేను నా కెరీర్ ని చూడలేదు” అంటూ నాని సమాధానం చెప్పేశాడు. తాను చేసే ప్రతి సినిమాతో ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఎంతో సంతోషంగా ఉన్నారని.. ఇప్పుడప్పుడే తనని వదులుకోరు అంటూ చెప్పుకొచ్చాడు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbenjaminsbet girişgrandpashabet