iDreamPost
android-app
ios-app

ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచేస్తున్న అడవి శేష్.. 2025లో ఏకంగా 3 మూవీస్!

  • Published Sep 22, 2024 | 6:09 PM Updated Updated Sep 22, 2024 | 6:09 PM

Hero Adivi Sesh 2025 releases: దాదాపు ఇండస్ట్రీ లో ఉండే హీరోలంతా కూడా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే, కంటెంట్ ను నమ్మి సినిమాలు చేసే యాక్టర్స్ మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో అడవి శేష్ కూడా ఒకరు. అయితే 2025 లో ఏకంగా ఈ హీరో 3 సినిమాలను రిలీజ్ చేయనున్నారట. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Hero Adivi Sesh 2025 releases: దాదాపు ఇండస్ట్రీ లో ఉండే హీరోలంతా కూడా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. అయితే, కంటెంట్ ను నమ్మి సినిమాలు చేసే యాక్టర్స్ మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో అడవి శేష్ కూడా ఒకరు. అయితే 2025 లో ఏకంగా ఈ హీరో 3 సినిమాలను రిలీజ్ చేయనున్నారట. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 22, 2024 | 6:09 PMUpdated Sep 22, 2024 | 6:09 PM
ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచేస్తున్న అడవి శేష్.. 2025లో ఏకంగా 3 మూవీస్!

ప్రేక్షకులు ఇప్పుడు సినిమాలను ఆదరించే తీరు మారుతుంది. ఎందుకంటే ఒకప్పుడు స్టార్ క్యాస్టింగ్ , భారీ బడ్జెట్ , ఇంటెన్స్ యాక్షన్స్ ఉంటె మాత్రమే సినిమాలను ఇష్టపడే వారు. కొంతకాలం అదే ట్రెండ్ కూడా నడిచింది. కానీ , ఇప్పుడు అలా కాదు.. పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారా హై ఫై బ్యాక్గ్రౌండ్ ఉందా అనేవి చూడడం లేదు. కేవలం కంటెంట్ ను మాత్రమే చూస్తున్నారు. ఇలా కంటెంట్ ను నమ్మి ముందుకు వెళ్లే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారికి ఇప్పుడు క్రేజ్ బాగా పెరుగుతుంది కూడా. ఇలాంటి హీరోలలో టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ ముందుంటాడు. ఈ హీరోకు ఇండియా వైడ్ గా సూపర్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ క్రమంలో 2025లో అడవి శేష్ ఏకంగా 3 సినిమాలను రిలీజ్ చేయనున్నారట. దానికి సంబంధించిన విషయాలు ఇలా ఉన్నాయి.

అడవి శేష్ ప్రస్తుతానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం గూఢచారి సినిమాకు సిక్వెల్ గా వస్తున్న ‘జీ2’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి ప్రీ లుక్ పోస్టర్ ను కూడా రివీల్ చేశారు. ఈ సినిమా కాకుండా. షనీల్‌ డియో దర్శకత్వం వహిస్తున్న డెకాయిట్ మూవీలో కూడా నటిస్తున్నాడు. ఆ దర్శకుడికి ఇదే తొలి చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ టైటిల్ టీజర్ ఇప్పటికే ప్రేక్షకులలో మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. ఇక ఇవి కాకుండా మూడో సినిమా కూడా చేస్తున్నట్లుగా హింట్ ఇచ్చేసాడు.దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు కానీ.. 2025లో మూడు సినిమాలు విడుదల అనే ట్వీట్‌ తో ఈ మూడో సినిమాపై క్లారిటీ వచ్చేసింది. సో ప్రేక్షకులకు మంచి కంటెంట్ అందించడానికి ఈ హీరో రెడీ అయిపోతున్నాడు.

ఇక అడవి శేష్ ట్వీట్ తో.. అభిమానులలో క్యూరియాసిటీ పెరిగిపోయింది. మూడో సినిమా ఏమై ఉంటుంది? శైలేష్ కొలను డైరెక్షన్ లో నాని నటిస్తున్న హిట్ 3 నా ? ఇందులో అడవి శేష్ మెయిన్ లీడ్ లో నటిస్తున్నాడా ? ఇలా రకరకాలుగా డిస్కస్ చేస్తున్నారు సినీ ప్రేక్షకులు. మొత్తానికి అడవి శేష్ ఎదో భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఏమౌతుందో చూడాలి మరి. ఆల్రెడీ ఈ హీరోకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఓ డిఫరెంట్ పాయింట్ తో అడవి శేష్ సినిమాలను తీస్తూ ఉంటాడు. మరి ఈసారి ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş